ఖమ్మం ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డిని గెలిపించాలని అన్నారుగూడెం ఇంటింటా ప్రచారం..
మారెళ్ళ మల్లికార్జున్ రావు, డైరెక్టర్ గోవిందు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీగా హాజరైన కాంగ్రెస్ శ్రేణులు..
ఖమ్మం / తల్లాడ మే 5 సీకే న్యూస్ ప్రతినిధి విజయ్
కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆదివారం తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్, మారెళ్ళ మల్లికార్జునరావు, సొసైటీ డైరెక్టర్ గోవిందు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేందుకు ప్రతి ఒక్కరు హస్తం గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆరు గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దుగ్గినేని గోపయ్య, యల్లంకి వెంకటేశ్వరరావు, అన్నారుగూడెం మాజీ ఎంపీటీసీ తాళ్ల జోసెఫ్, మల్లిడి రామయ్య, దొడ్డ వెంకటయ్య, తోట వెంకటేశ్వరరావు, అలవాల దావీదు, రెంటపల్లి మరియన్న, రాకేష్, నాగేశ్వరరావు, రామారావు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.