రఘురాం రెడ్డిని గెలిపించాలని అన్నారుగూడెంలో ప్రచారం, పోస్టర్లు పంపిణీ.. ఖమ్మం తల్లాడ మే 5 సీకే న్యూస్ ప్రతినిధి విజయ్ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు ఆదివారం తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామంలో పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మలపల్లి రమేష్, పొన్నం కృష్ణయ్య కరపత్రాలను ఆవిష్కరించి, ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను తప్పకుండా …

రఘురాం రెడ్డిని గెలిపించాలని అన్నారుగూడెంలో ప్రచారం, పోస్టర్లు పంపిణీ..

ఖమ్మం తల్లాడ మే 5 సీకే న్యూస్ ప్రతినిధి విజయ్
ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు ఆదివారం తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామంలో పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మలపల్లి రమేష్, పొన్నం కృష్ణయ్య కరపత్రాలను ఆవిష్కరించి, ఇంటింటా ప్రచారం నిర్వహించారు.

అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తుందని తెలిపారు. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ నగదు జమ చేస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచేందుకు ప్రతి ఒక్కరు హస్తం గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవిందు శ్రీనివాసరావు ట్రాక్టర్, రావుల గోపి గౌడ్, షేక్. జానీ, యువజన నాయకులు పిన్ని హరీష్, చాపలమడుగు కృష్ణ, గొడ్ల గురవయ్య, కార్తీక్, వేలాద్రి, ఇస్నపల్లి హనుమయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated On 6 May 2024 11:58 AM IST
cknews1122

cknews1122

Next Story