
భద్రాచలం పాత మార్కెట్ వద్ద అగ్నిప్రమాదం
భద్రాచలం పట్టణంలోని పాత మార్కెట్ వద్ద గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది.
మంటలు చెలరేగడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.