ఆలేరు మండల వీవర్స్ సెల్ అధ్యక్షుడిగా మెరుగు శ్రీధర్
సి కే న్యూస్ (సందెన శంకర్) మే 17
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కాంగ్రెస్ పార్టీ వీవర్స్ సెల్ అధ్యక్షుడిగా మెరుగు శ్రీధర్ ను నియమించారు.శుక్రవారం నాడు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించుకుంటూ ప్రభుత్వము చేనేత కార్మికులకు అన్ని విధాల ఆదుకుంటామని అన్నారు.ఈ నియామక పత్రాన్ని అందజేసిన యాదాద్రి భువనగిరి జిల్లా వీవర్స్ సెల్ అధ్యక్షుడు గుర్రం శ్రీనివాస్ నేత కు మండల వీవర్స్ అధ్యక్షుడు మెరుగు శ్రీధర్ కృతజ్ఞతలు తెలిపారు…
ఈ కార్యక్రమంలో రచ్చ హనుమంతు బిర్రు లక్ష్మిపతి అంబటి చంద్రమౌళి కొండ కిషోర్ బిర్రు శ్రీనివాస్ బేతి ఉప్పలయ్య ఎన్నం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.