మత్స్య సహకార సంఘం సభ్యత్వం పేరుతో దగా
వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారికి వినతి
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య మే 17
హుజూర్ నగర్ మత్స్యశాఖ సొసైటీ సభ్యత్వం పేరుతో అధిక వసూళ్లు చేస్తు సామాన్యులను దగా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా కొత్త వారికి సభ్యత్వానికి అవకాశం కల్పించాలని కోరుతూ శుక్రవారం జిల్లా మత్స్యశాఖ అధికారి ఠాకూర్ రూపేందర్ సింగ్
కి వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా పలువురు మత్స్య సహకార కమిటీ సభ్యులు మాట్లాడుతూ అర్హులైన కొత్త వారందరికీ సొసైటీలో సభ్యత్వం ఇవ్వాలని గతంలో సభ్యత్వం పేరుతో ఒక్కొక్కరి నుండి 2వేల రూపాయలు వసూలు చేశారని,నేటికీ వారికి సభ్యత్వాలకు సంబంధించిన ఎటువంటి రసీదులు ఇవ్వలేదని అన్నారు.
చనిపోయిన మత్స్య కార్మికులకు ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్సూరెన్స్ కూడా అందడం లేదన్నారు ఇట్టి కార్యక్రమంలో ములకలపల్లి సీతయ్య, ములకలపల్లి రామ్ గోపి, పి.వెంకటేశ్వర్లు,కే. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.