హత్య కు గురైన కొల్లాపూర్ బీఆర్ఎస్ నాయకుడు
సీ కే న్యూస్ ప్రతినిధి, పెంట్లవెల్లి:
కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలోని చిన్నంబావి మండలం లక్ష్మీ పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడు శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు వివరాల్లోకి వెళితే బుధవారం రాత్రి ఆయన నిద్రిస్తున్న సమయంలో ఎవరో గుర్తుతెలియని దుండగులు వచ్చి గొడ్డలితో నరికి నట్లు కనపడుతుందని స్థానికుల ద్వారా తెలుపబడింది ఇక ఈ విషయంపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది నిందితుడు ఎవరు ఎందుకు ఈ ఘటన చోటు చేసుకుందనే అంశంపై ప్రజలు వేచి చూడాల్సిందే