హత్య కు గురైన కొల్లాపూర్ బీఆర్ఎస్ నాయకుడు
సీ కే న్యూస్ ప్రతినిధి, పెంట్లవెల్లి:
వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని లక్ష్మీ పల్లిలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు బీఆర్ఎస్ నాయకుడు అయిన శ్రీధర్ రెడ్డి (45) అతి కిరాతకంగా నరికి చంపారు.
వేసవి కావడంతో తన ఇంటి బయట నిద్రిస్తున్న బాధితున్ని దుండగులు గొడ్డలితో నరికారు. దీంతో తీవ్రగాయాలైన శ్రీధర్ రెడ్డి అక్కడిక్కడే మృతి చెందారు. దీంతో ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.