హుజూర్ నగర్ లో ఆగని మట్టి మాఫియా
చెరువులో అక్రమంగా పరిధికి మించి లోతుగా త్రవ్వకాలు
అడ్డగోలుగా పోటీపడి నేనంటే నేను ముందంటూ ప్రమాదకరంగా ట్రాక్టర్ల తోలకాలు
మట్టి ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి
చర్యలపై నిర్లక్ష్యమే నీటి నష్టానికి కారణమా…?
చెరువు ఆక్రమణదారులకు చెక్ పెట్టేదెవరు…?
మట్టి ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతి
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) మే 24
హుజూర్నగర్ పట్టణంలో మట్టి మాఫియాకు అడ్డుకట్ట వేసే వారే లేరా మట్టి మాఫియా దారులు చెరువు అక్రమణ దారులు కలిసి హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని చెరువులలో అనుమతులు లేకుండా అక్రమంగా చెరువు మట్టిని తోడుకుంటున్నారు.
రైతుల పొలాలకు మట్టి తోలుతున్నామని సాకుతో మట్టి మాఫియాదారులు చెరువులో అక్రమంగా పరిధికి మించి లోతుగా త్రవ్వకాలు అడ్డగోలుగా పోటీపడి నేనంటే నేను ముందంటూ ప్రమాదకరంగా రోడ్లపై ట్రాక్టర్ల తోలకాలు అడ్డు అదుపు లేకుండా ఒకొక్క ట్రాక్టర్ ట్రిప్పుకు 500రు నుండి 600.రు వరకు అమ్ముకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.
మట్టి అమ్మకంతోపాటు చెరువు సరిహద్దు పక్కన ఉన్న కొంత మంది వ్యక్తులు చెరువుల శిఖాన్ని సైతం కబ్జా చేస్తున్న సంబంధిత ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
చెరువుల అక్రమ మట్టి తోలకాలు చెరువు ఆక్రమణ విషయంపై స్థానికులు సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవడం లేదు.
మట్టి ట్రాక్టర్ బోల్తా వ్యక్తి మృతి
హుజూర్నగర్ పట్టణంలో శుక్రవారం అక్రమంగా మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.
హుజూర్ నగర్ ఎస్సై ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం హుజూర్ నగర్ పరిధిలోని మగ్దూమ్ నగర్ కు చెందిన జడ నాగయ్య వయసు (45 సం.) అను అతను తన యెక్క టి ఎస్ 29ఈ 9490, ట్రాలీ నెంబర్ ఎపి24 టిబి 9307 నెంబర్ గల ట్రాక్టర్ తో పోతిరేని కుంట చెరువు నుండి తన వ్యవసాయ పొలానికి మట్టి తొలుచున్న సమయంలో మేరిగ గురవయ్య పొలం వద్దకు రాగానే ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడగ మృతుడు తలమీద పై ట్రక్కు పడగా అతని తలకు బలమైన గాయాలు కాగా అక్కడిక్కడే మరణించాడని మృతుని చిన్న కుమారుడు జడ భాను ప్రకాష్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.