సీనియర్ జర్నలిస్ట్ తమ్మిశెట్టి నివాళులు
ఇల్లందు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో రూ 11 వేలు ఆర్థిక సాయం
సి కే న్యూస్ ఇల్లందు నియోజకవర్గ ప్రతినిధి
మే 30,
ఇల్లందు పట్టణంలో గత 15 ఏళ్లకు పైగా జర్నలిస్టుగా పనిచేసిన తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు బుధవారం అర్ధరాత్రి మృతి చెందారు ఈ మేరకు ఆయన మృతి సమాచారం తెలుసుకున్న ఇల్లెందు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రవీందర్ యాదవ్ తన క్లబ్ సభ్యులతో కలిసి వెంకటేశ్వర్లు స్వగ్రామానికి వెళ్లి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు
అనంతరం వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులను పరామర్శించి రూ 11,000 ఆర్థిక సాయం అందజేశారు
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసాచారి ఉపాధ్యక్షులు కాపు సురేష్ బాబు ప్రచార కార్యదర్శి సలీం సభ్యులు రంజిత్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.