బచ్చోడు తండా కార్యాలయంలో ఎగరని మూడు రంగుల జెండా కనిపించని ఆవిర్భావ దినోత్సవం.
ఇష్టారాజ్యంలా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శి.
మొన్న మంత్రి పర్యటనలో తమ సమస్యలు వ్యక్తం చేసీన స్థానికులు.
పంచాయతీ కార్యదర్శుపై సిరియస్ అయిన మంత్రి.
త్రాగు నీటి సరఫరా లేక అవస్థలు పడుతున్న స్థానిక ప్రజలు.
తెలంగాణం,జూన్ 02, పాలేరు.
తిరుమలాయపాలేం: మండల పరిధిలోని అతిపెద్ద గిరిజన గ్రామమైన బచ్చోడుతండా గ్రామంలో మంచినీటి సరఫరా లేకపోవడంతో స్థానిక ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు.తమ సమస్యలు పంచాయతీ కార్యదర్శికీ చేప్పకుందామంటే ఎన్నడు కార్యాలయానికి రానీ పరిస్థితి ఏర్పడిందనీ. గతంలో పనిచేసిన దగ్గర కూడా ఇష్టారాజ్యంలా వ్యవహరించాడనీ పంచాయతీ కార్యదర్శి ప్రసన్నకుమార్ పై విమర్శలు వినిపిస్తున్నాయి.
తనే బాస్ లా వ్యవహారిస్తున్నాడనీ, గ్రామంలో సమస్యలు తెలుసుకోవడానికీ పర్యటనలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చిన సందర్భంగా స్థానిక ప్రజలు తమ బాధను విన్నపించుకున్నారు.
ఉన్నతాధికారులు ఎన్నీసార్లు ఫోన్ చేసీన పంచాయతీ కార్యదర్శికీ కనువిప్పు కలగడంలేదనీ. కళ్యాణ లక్ష్మి, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఇంటి పన్ను, సంబంధిత సంతకాల కోసం గ్రామపంచాయతీ కార్యాలయం చుట్టూ తిరిగిన ప్రతి రోజు తాళం వేసే ఉన్నది తప్ప ఏ ఒక్కరోజు పంచాయతీ కార్యదర్శి కార్యాలయానీకీ వచ్చిన దాఖలు లేవనీ, గ్రామంలో మంచినీళ్ల సమస్యలు, డ్రైనేజీ కాలువల పరిస్థితి దయనియంగా మారిపోయిందనీ మంత్రి పోంగులేటీ శ్రీనివాస్ ముందు స్థానిక ప్రజలు తమ అవేదన వ్యక్తం చేశారు.
*వర్కర్లతో పనీ చేపీంచుకునీ డబ్బుల కోసం ఫోన్ చేసిన స్పందించడం లేదని దినసరి కార్మికులు పత్రీక వీలేకరుల ముందు తమ అవేదనను వ్యక్తం చేశారు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాన్ని బర్తాఫ్ చేయాలని జిల్లా కలెక్టర్ విపీ గౌతమ్ కీ స్థానిక ప్రజలు కోరుతున్నారు.