సి.సి రోడ్డు కాంట్రాక్టర్ల జేబుల్లోకి డబ్బులు, గాల్లోకి ప్రయాణికుల ప్రాణాలు.
“అభివృద్ధి మాటల్లోనే’ చేతల్లో కాదు.!”
“విశాలమైన పంచాయతీ రోడ్లను అభివృద్ధి పేరుతో అడుగులలో కుదింపు”
“పర్యవేక్షణ అధికారులను రాత్రి కలిస్తే చాలు పగలు సైట్ మీదకి రారు, అని పలు ఆరోపణలు వెల్లడి.?”
“పొలిటికల్ నీడలో అనర్హులకు డెవలప్మెంట్ టెండర్ అర్హతలు.!”
“ప్రమాదాన్ని ప్రోత్సహిస్తున్న నాయకులను ప్రజలు మర్చిపోతారా.!”
“ములుగు జిల్లా సి కె న్యూస్ ప్రతినిధి భార్గవ్”
ఇటీవల ములుగు జిల్లాలోని పలు మండలాలలో స్పెషల్ బడ్జెట్ తో గ్రామ అభివృద్ధి పనులలో భాగంగా వివిధ రకములైన మండల అభివృద్ధి కార్యక్రమాలు మండల అధికారుల ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ నేపథ్యంలో వెంకటాపురం మండలంలోని గ్రామపంచాయతీ విశాలమైన రోడ్లను కాస్త అభివృద్ధి పేరుతో సిసి రోడ్ డెవలప్మెంట్ నేపంతో ఉన్న విశాలమైన రోడ్లను కాస్త సిసి రోడ్లు వేసి భయాందోళన రోడ్లగా మార్చిన పరిస్థితులు
ములుగు జిల్లా వ్యాప్తంగా నెలకొన్నాయి. ఉదాహరణ:- వెంకటాపురం మండలంలోని కర్ల బజార్ – జగదాంబ సెంటర్- చుక్కల- వీరాపురం- అరుణాచలపురం-పెద్ద గొల్లగూడెం-పాత్ర పురం-చెరుకూరు-జగన్నాధపురం_గ్రామాలలో రోడ్డు వేశారు మట్టి మరిచారు అని ప్రయాణికులు పలుమార్లు పత్రిక ముఖంగా వెల్లడించినప్పటికీ అధికారుల స్పందన మాత్రం శూన్యం.
ఇది ఇలా ఉండగా సిసి రోడ్డు నిర్మాణం పనులు పూర్తి కాకమునుపే రాజకీయ నాయకుల అండదండలతో ప్రభుత్వ అధికారులనే భయభ్రాంతికి గురిచేసి సంబంధిత శాఖకు మండలాల నుంచి ఫోన్ చేసి అధికారులను శారీరిక మరియు మానసిక ఒత్తిళ్ళను కలగజేసి మా పార్టీ వాడు మా మనిషి అనే ప్రత్యేక పదాలను వాడి మరమ్మతులు పూర్తి కాకమునుపే బిల్లులను ఒడ్డెక్కిస్తున్నారు అనే ఆరోపణలు పంచాయతీ వీధులలో చక్కర్లు కొడుతున్నాయి. ఉన్నత చదువులు చదువుకున్న ఐ.ఏ.ఎస్ – ఐ.పీ.ఎస్/ అధికారుల కంటే పలక బలపం పట్టని రాజకీయ నాయకులకే చట్టాలు సైతం వనకడం పై పలు గిరిజన సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఈనెల రెండవ వారంలో బడి పిల్లల బడులు పున: ప్రారంభం కావస్తున్నందున పంచాయతీ వీధులలో స్కూల్ పిల్లల ఆటోలు తిరిగేందుకు సైతం వీలులేని ఇటీవల ఏర్పరిచిన పంచాయతీ సిసి రోడ్లకు ఇరువైపులా ఉన్నటువంటి ప్రమాదకరమైన సీసీ రోడ్డు అంచులను మట్టి వేసి సదును చేయాలని ములుగు జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంత గ్రామస్తుల మనవి .