వరకట్న వేధింపులు తాళ లేక మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. ఏన్కూరు ఎస్సీ కాలనీకి చెందిన పూనెం విజయ (23) మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
పోలీసుల కథనం ప్రకారం ఏన్కూరు ఎస్సీ కాలనీకి చెందిన చిలుకూరి అఖిల్ కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం,
వేములవాడ గ్రామానికి చెందిన పూనెం విజయతో ఏడాది క్రితం ప్రేమ వివాహం జరిగింది. కొన్ని నెలల నుండి తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
అత్త శిరోమణి, భర్త అఖిల్, ఆడబిడ్డ కీర్తన తరచూ వేధిస్తున్నారని, కట్నం డబ్బులు తీసుకుని వస్తేనే ఇంటికి రావాలని వేధించడం వల్ల అవి భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది.
తన బిడ్డను భర్త, అత్త, ఆడబిడ్డ కలిసి చంపారని మృతురాలి తల్లి సమ్మక్క ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ బాదావత్ రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.