తెలంగాణ గురువులకు గుడ్‌న్యూస్..
సీఎం దగ్గరకు ఫైల్.. నేడో, రేపో ఉత్తర్వులు జారీ
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు సంబంధించి ముందడుగు పడింది. ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించిన ఫైల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం కోసం పంపారు. విద్యాశాఖ రేవంత్ దగ్గర ఉండటంతో.. ఫైల్ ఆయ నకు దగ్గరకు పంపించారు.
సీఎం రేవంత్ ఫైల్‌కు ఆమో దం తెలిపగానే షెడ్యూల్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణలో ఈ నెల 12 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభంకానున్నాయి.. దీంతో షెడ్యూల్‌ను ఒకటి, రెండు రోజుల్లో విడుదల చేయొచ్చని చెబుతున్నారు. 19వేలమంది టీచర్లకు పదోన్నతలు దక్కుతాయం టున్నారు.
వాస్తవానికి గతేడాదిలోనే ఈ ప్రక్రియ చేపట్టారు.. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు కసరత్తు చేశారు. అయితే ప్రమోషన్లకు టెట్ లో ఉత్తీర్ణత తప్పనిసరని సెప్టెంబరు నెలాఖరులో హైకోర్టు తీర్పు ఇచ్చింది..
దీంతో ఆ ప్రక్రియ మొత్తం ఆగిపోయింది. అలాగే జీవో 317తో ఇతర జిల్లాల నుంచి టీచర్లు రావం వల్ల తమ సీనియార్టీ దెబ్బతిని నష్టపోతున్నామని.. రంగారెడ్డి జిల్లకు చెందిన టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు.
అయితే అప్పటికే మల్టీ జోన్-1 (వరంగల్) గెజిటెడ్ హెచ్ఎంలుగా ప్రమోషన్లు, బదిలీలు పూర్తికాగా.. 782మందికి ప్రమోషన్ దక్కింది. స్కూల్ అసిస్టెంట్ల ట్రాన్స్ఫర్లు పూర్తికాగా.. ప్రమోషన్లు పూర్తి కాలేదు.
వాళ్లందరిని పాత స్థానాల నుంచి రిలీవ్ చేయలేదు.. ఎస్జీటీల బదిలీలు కూడా నిలిచిపోయాయి. మల్టీ జోన్-2,హైదరాబాద్‌లో కేవలం ప్రభుత్వ స్కూళల్లో గెజిటెడ్ హెచ్ఎంల ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు పూర్తయ్యాయి..
147మందికి పదోన్నతులు దక్కాయి. స్థానిక సంస్థల జడ్పీ ఉన్నత,స్కూళ్ల జీహెచ్‌ఎంల బదిలీలు ముగియగా.. మిగిలిన వారివి మాత్రం నిలిచిపో యాయి.ఈ ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ.. గతేడాది ఎక్కడ ప్రక్రియ ఆగిపోయిం దో అక్కడి నుంచే మళ్లీ మొదలు కానున్నట్లు సమాచారం.
మల్టీ జోన్-1లో కొంత ప్రక్రియ పూర్తి కావడంతో.. దానికి ఒక షెడ్యూలు, మల్టీ జోన్-2కు మరో షెడ్యూలు జారీ చేసే అకాశం ఉంది. మల్టీ జోన్-1లో స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల నుంచి ప్రక్రియ మొదలు కానుంది..మల్టీ జోన్-2కు మరో షెడ్యూలు విడుదల చేయనున్నారు.
గత మార్చిలో లాంగ్వేజ్ పండిట్ పోస్టుల అప్‌గ్రేడేషన్‌పై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు వెల్డించింది.