KhammamPoliticalTelangana

కుక్కల దాడి నుంచి తపిచ్చుకొని ఎమ్మేల్యే ఆఫీస్ లోని వచ్చిన దుప్పి

— నా ప్రాణాలను కాపాడండి….

— కుక్కల దాడి నుంచి తపిచ్చుకొని ఎమ్మేల్యే ఆఫీస్ లోని వచ్చిన దుప్పి.

— దుప్పికి ప్రధమ చికిత్స అందించిన ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దయానంద్, డాక్టర్ మట్ట దయానంద్.

సి కే న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునిర్.

సోమ వారం స్థానిక అర్బన్ పార్క్ నుంచి ఒక దుప్పి అనుకోకుండా అడవి నుంచి బయటికి వచ్చి జలగం నగర్ వద్ద కుక్కల దాడి లో తీవ్రంగా గాయపడి సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్న సంఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

అదే సమయంలో క్యాంప్ ఆఫీస్ లో వున్న సిబ్బంది అక్కడే ఆఫీస్ లో వున్న సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ కి, రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ కి తెలియజేయగా వెంటనే స్పందించి ఎమ్మెల్యే అత్యవసరం గా దుప్పికి ప్రధమ చికిత్స అందించి మూగ జీవి ప్రాణాలు కాపాడి ఫారెస్ట్ అధికారులకు మరియు వెటర్నరీ డాక్టర్స్ కు చికిత్స నిమిత్తం అందించినరు.

ఈ సంఘటన చూసిన ప్రజలు నియోజకవర్గంలోని ప్రజలకే కాకుండా మాకు సైతం దిక్కూ మీరే ఎమ్మెల్యే గారు అని ఈ దుప్పి వెతుక్కుంటూ ఆఫీసుకు వచ్చిందని అందరూ అనుకుంటున్నారు .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button