రంజిత్ కుమార్ ఆత్మహత్య కు కారకులైన వ్యక్తులు అరెస్టు
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) జూన్ 10
హుజూర్ నగర్ పట్టణం పద్మశాలి బజార్ కు చెందిన చిట్టిప్రోలు రంజిత్ కుమార్ సుమారు 14 సం.రాల క్రితం శ్రీనివాసాపురం గ్రామానికి చెందిన స్వప్న అను ఆమె ను ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు.
వారికి ఇద్దరు కుమార్తెలు వర్శిత వయసు 12 సం.రాలు, జెస్విత వయసు 09 సం.రాలు. గత సం.రం స్వప్న కు సీతారాంనగర్ కాలనీలో రేషన్ డీలర్ షాప్ రావడంతో గత సం.రం నుండి వంగర లింగయ్య ఇంటిని కిరాయి కి తీసుకొని రేషన్ షాప్ నడుపుకుంటు, రంజిత్ కుమార్ ఫొటోగ్రాఫర్ పనిచేసుకుంటూ జీవిస్తున్నారు.
సుమారు ఆరు నెలల క్రితం రంజిత్ కుమార్ కులస్తుడైన మిట్టకోలు దుర్గా ప్రసాద్ తో స్వప్నకు పరిచయం ఏర్పడినది. అట్టి పరిచయం కాస్త వివాహేతర సంబందానికి దారితీసినది. ఆ తరువాత దుర్గా ప్రసాద్ మృతుడికి తెలియకుండా స్వప్న ను తిరుపతి తీసుకొని వెళ్ళగా అట్టి విషయం తెలిసి మృతుడు రంజిత్ కుమార్ పలుమార్లు వారిని హెచ్చరించినారు
అయిననూ వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. దానితో కుటుంబంలో బాగా గొడవలు జరుగుచున్నవి. రెండు మూడు సార్లు అత్త రాచకొండ నాగమణి, భామ్మర్ధి చంద్రశేఖర్, ప్రియుడు దుర్గాప్రసాద్, స్వప్న లు మృతుడైన రంజిత్ కుమార్ ను తిట్టి కొట్టినారు. దానితో రంజిత్ కుమార్ సుమారు నెల రోజుల క్రితం తన చావుకు భార్య స్వప్న, దుర్గా ప్రసాద్, అత్త నాగమణి, భామ్మర్ధి చంద్ర శేఖర్ లే కారణమని సెల్పి వీడియో తీసుకున్నాడు.
అట్టి వీడియో ఎందుకు తీసుకున్నవని మరలా మృతున్ని కొట్టి ఇంట్లో నుండి వెల్లగొట్టినారు. మృతుడు గత నెల రోజుల నుండి మట్టంపల్లి గ్రామంలోని తన భావ ఖుర్షీద్ రెస్టారెంట్ లో పనిచేసుకుంటూ అక్కడే ఉంటూ తేదీ 07.06.2024 రోజు తన కూతుర్లను చూడడం కోసమని మరలా సీతారాంనగర్ కాలనిలోని తన భార్య నివసించే ఇంటికి వచ్చి, భార్యతో గొడవపడగా, అట్టి విషయంలో అతని భార్య అయిన స్వప్న అదే రోజు హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాధు ఇవ్వగా కేసు నమోదు అయినది.
ఆ తరువాత తేదీ 08.06.2024 న స్థానికులు రంజిత్ కుమార్ తన ఇంట్లో ఊరి వేసుకొని చనిపోయిన విషయాన్ని గమనించి అట్టి విషయాన్ని రంజిత్ కుమార్ కుటుంబ సభ్యులకు తెలుపగా వారు వెళ్ళి మృతిని శవాన్ని చూసి, తన కుమారుడు రంజిత్ ను భార్య స్వప్న, ఆమె తల్లి రాచకొండ నాగమణి, అన్న రాచకొండ చంద్ర శేఖర్ మరియు మిట్టకోలు దుర్గా ప్రసాద్ లు మానసికంగా, శారీరకంగా వేదించి చనిపొమ్మని వేదించడం వలన తన కుమారుడు ఊరి వేసుకొని చనిపోయినాడు అని మృతుని తల్లి చిట్టిప్రోలు పద్మ పిర్యాధు మేరకు కేసు నమోదు చేసుకొని ఈ రోజు నలుగురు నేరస్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కుపంపినట్లు సి ఐ చారమందరాజు ఎస్ ఐ ముత్తయ్య లు తెలిపారు.