పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాసలీలలు?
హనుమకొండ జిల్లాలో చిక్కిన ఖమ్మం అధికారి
విచారించి వదిలేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు?
హసన్‌పర్తి: ఖమ్మం జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్ పాడు పనికి ఒడిగట్టాడు.
యువతితో రాసలీలలు సాగిస్తూ పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన హనుమకొండ నగరంలోని చింతగట్టు సమీపాన ఓ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ మారిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన సదరు అధికారి ఖమ్మం జిల్లాలో ఎస్‌ఐబీ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
2009లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన ఆయన 2014లో ఎస్సైగా, ఆతర్వాత ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొంది ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్నాడు. ఆ ఇన్‌స్పెక్టర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది.
అయితే, మంగళవారం సదరు ఇన్‌స్పెక్టర్ తన ప్రియురాలితోపాటు మరికొందరు స్నేహితులతో కలిసి చింతగట్టు సమీపాన ఫంక్షన్ హాల్‌లో విందు ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ఓ గదిలో స్నేహితులు మద్యం సేవిస్తుండగా, ఇంకో గదిలో యువతితో ఆ సీఐ రాసలీలల్లో మునిగి తేలినట్లు తెలిసింది.
ఈ విషయం టాస్క్‌ఫోర్స్ పోలీసులకు తెలియడంతో వారు వెళ్లి యువతితో ఉన్న పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను చూసి షాక్‌కు గురైనట్లు సమాచారం. అయితే, టాస్క్‌ఫోర్స్ పోలీసులను గమనించిన ఇన్‌స్పెక్టర్ స్నేహితులతోపాటు యువతి పారిపోయినట్లు తెలిసింది.
దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి వదిలిపెట్టినట్లు సమాచారం. అయితే, సదరు ఇన్‌స్పెక్టర్ స్నేహితులను, యువతిని పోలీసులే తప్పించారా లేక పరారయ్యారా అన్నది చర్చ జరుగుతోంది. ఈ విషయమై పోలీసులను సంప్రదించడానికి ప్రయత్నించగా ఎవరూ అందుబాటులోకి రాలేదు.