HyderabadPoliticalTelangana

భార్యతో గొడవ పడి రౌడీ షీటర్ సూసైడ్…

భార్యతో గొడవ పడి రౌడీ షీటర్ సూసైడ్…

భార్యతో గొడవ పడి రౌడీ షీటర్ సూసైడ్…

భార్యతో గొడవ పడి ఓ రౌడీషీటర్​ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ భాస్కర్ తెలిపిన ప్రకారం..
ఎస్‌.ఐ.భాస్కర్‌ తెలిపిన వివరాల ప్రకారం పోలీస్‌ స్టేషన్‌ పరిధి లోని కేశవస్వామి నగర్‌ లో ఉంటున్న హత్వాల్‌ ఉమేశ్‌ (35)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఉమేశ్‌ తరచూ గొడవలకు దిగుతున్న కారణంగా 2011 లో కూల్సుంపురా పోలీస్‌ స్టేషన్‌ లో రౌడీ షీటర్‌ గా నమోదయ్యాడు.

అప్పటి నుండి గొడవలు, గంజాయి విక్రయాలు, హత్యలకు పాల్పడటంతో తరచూ జైలుకు వెళ్లి వస్తుండేవాడు. ఇతని పైన దాదాపు 17 కేసులు నమోదై ఉన్నాయి. కాగా గత కొంత కాలంగా ఇంట్లో భార్యతో గొడవలు జరుగుతున్నాయి.

ఆదివారం కూడా ఏదో విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత భార్య వంటింట్లో వంట చేస్తుండగా ఆ సమయంలో ఉమేశ్‌ బెడ్రూంలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఎంత కొట్టినా తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన భార్య..స్థానికుల సహాయంతో తలుపులు బద్దలు కొట్టింది.

కాగా అప్పటికే ఫ్యాన్‌కు ఉరేసుకున్న ఉమేశ్‌ కొన ఊపిరితో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఉస్మానియా దవాఖానకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఉమేశ్‌ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button