ఆరేళ్ల బాలికపై పైశాచికంగా ఆత్యాచారం…. ఆపై హత్య
అభం..శుభం తెలియని ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి పైశాచికంగా ఆత్యాచారం చేసి ఆపై హతమార్చిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల పరిధిలోని కాట్నపల్లిలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బలరాం కొన్నాళ్లుగా కాట్నపల్లిలోని కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఆసిఫాబాద్ జిల్లా దాయిగాం గ్రామానికి చెందిన మహేష్ దంపతులు అదే గ్రామంలోని రైస్ మిల్లులో పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. వాళ్లకు ఓ ఆరేళ్ల పాప కూడా ఉంది.
అయితే, మధ్యప్రదేశ్ కూలీ బలరాం కళ్లు ఆ పాపపై పడ్డాయి. దీంతో గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిద్రిస్తున్న పాపను బలరాం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టలాడు.
బాలిక బ్రతికి ఉంటే విషయం ఎక్కడ బయటకు వస్తుందోనని భావించిన బలరాం స్పాట్‌లోనే గొంతు నులిమి దారణంగా హతమార్చాడు. మృతదేహాన్ని గమనించి స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం అందజేయగా వారు.. బారు కన్న కూతురి మృతదేహంపై పడి బోరున విలపించారు.
తమ కూతురిని హత్య చేసిన వాడిన ప్రాణాలతో వదలకూడదని, వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలని బాలిక తల్లిందండ్రులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.