హైటెక్ వ్యభిచార ముఠాను పట్టుకున్న పోలీసులు
ఓ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను వెస్ట్జోన్టాస్క్ఫోర్స్పోలీసులు అరెస్ట్‌చేశారు.
వారి వద్ద 85,500 నగదు, 2 కార్లు, 3 బైక్ లు , 18 సెల్ఫోన్లు,2 ల్యాప్ టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన ప్రకారం…సోమాజిగూడలోని పార్క్ హోటల్లో గురువారం వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వెళ్లి దాడి చేసి నిర్వాహకులను అరెస్ట్ చేశారు.
వెంగళరావునగర్డివిజన్మధురానగర్ కు చెందిన కె.సూర్యకుమారి అలియాస్వర్ష ,కె.విజయ శేఖర్ రెడ్డి, వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఆర్కోజిత్ముఖర్జీ బల్కంపేటలో ఉంటుండగా.. అతనికి వేణుగోపాల్, బాలాజీ లు ఆర్గనైజర్లు పని చేస్తున్నారు. ఆన్ లైన్ లో విటులను ఆకర్షించే పని చేస్తున్నారు. విజయవాడకు చెందిన సూర్యకుమారి ఇప్పటికే16 కేసుల్లో నమోదై ఉంది.
రాచకొండ పోలీసు పరిధిలో , ఆమెపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు అయ్యాయని పోలీసులు చెప్పారు. వివిధ రాష్ట్రాలు ఏపీ, వెస్ట్ బెంగాల్ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకు వచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
వారి వద్ద నుంచి 45 డిబెట్ కార్డులు, 22 బ్యాంకు చెక్‌లు,5 సిమ్ కార్డులు,25 ఆధార్ కార్డులు,7 పాన్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఇ,జానయ్య, ఎప్ఐ రంజిత్ కుమార్ కేసు నమోదు చేసి నిందితులను పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.