KhammamTelanganaUncategorized

రోడ్డు ప్రమాదంలో యువకుడు పెద్దకృష్ణ దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో యువకుడు పెద్దకృష్ణ దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో యువకుడు పెద్దకృష్ణ దుర్మరణం

సీకే న్యూస్ ప్రతినిధి విజయ్

తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామానికి చెందిన ఇస్నపల్లి పెద్దకృష్ణ (31 ) (ప్రసన్నకుమార్) ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

తల్లాడవైపు నుండి తన స్వగ్రామం అన్నారుగూడెం గ్రామానికి ఆటోలో వస్తుండగా అన్నారుగూడెం గ్రామ సమీపంలోని కాలువకట్ట వద్ద ప్రధాన రహదారిలో ఆటో ఒక్కసారిగా పల్టీ కొట్టింది.

ఈ ప్రమాదంలో పెద్దకృష్ణ తలకు తీవ్ర గాయాలు కావడంతోపాటు రక్తస్రావం జరిగింది. వెంటనే హుటాహుటీనా 108 ద్వారా ఖమ్మం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఆటోలో ఉన్న భార్యకు స్వల్ప గాయాలు అయ్యాయి. మృతునికి ఇద్దరు చిన్నపిల్లలు పాప, బాబు ఉన్నారు. పెద్దకృష్ణ తండ్రి నరసింహారావు ఫిర్యాదు మేరకు తల్లాడ ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button