కుక్కలు బాబోయ్ కుక్కలు.!
షాద్ నగర్ మున్సిపల్ పరిధిలోన కుక్కల బెడద..?
సోమవారం రాత్రి ఇంటి ముందు బాలునిపై కుక్కల దాడి…?
చిన్నపిల్లలు వృద్ధులు వాహనదారులపై దాడి చేస్తున్న వీధి కుక్కలు
కొంతమంది కుక్కలను పెంచుతూ.. వీధిలోకి వదిలేసి.. ఇతరులకు ఇబ్బందుల కు గురి చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు
సోమవారం రాత్రి ఇంటిమందు ఉన్న బాలుని కుక్కలు దాడి చేసి విపరీతంగా కరిచినవి
షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోన శునకాలు (వీధి కుక్కలు) భారీగా పెరిగిపోతున్నాయి. సోమవారం రాత్రి ఇంటి ముందు ఉన్న బాలుని విపరీతంగా కరిచి తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేసిన విది కుక్కలు .రాత్రిపూట ఒంటరిగా వెళ్లే వారిపై అలాగే మోటార్ సైకిళ్లపై వెళ్లే వాహనదారులపై దాడులకు పాల్పడుతున్నవి, గుంపులు గుంపులుగా ఎగబడి దాడి చేస్తూ కాలనీలో బైపాస్ రోడ్డు పక్కన దూరంగా ఉన్న పశువుల కొట్టల దగ్గర లేగ దూడలను ఆవులను గొర్రె మేక పిల్లలను కాటేస్తున్నావి. పెంపుడు కోళ్లను చంపేస్తున్నవి.
ముఖ్యంగా వాహనదారులు రోడ్లపై వెళ్లేటప్పుడు గుంపులుగుంపులుగా సడన్ గా వచ్చి తగలడంతో కింద పడి గాయాలపాలవుతున్నారు.
ముఖ్యంగా బైపాస్ రోడ్డులో టూరిస్టులు, విద్యార్థులు ఉద్యోగస్తులు, బెంగళూరు తిరుపతి తదితర ప్రాంతాల నుండి తెల్లవారుజామున బస్సులు దిగి పట్టణంలోనికి వెళుతుంటే కుక్కలు దాడి చేస్తున్నావని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. షాద్ నగర్ బైపాస్ లో..”అబ్బో కుక్కలు బాబోయ్ కుక్కలు అంటూ బెంబేలెత్తుతున్నారు.
” పౌల్ట్రీ ఫామ్ యజమానులు చనిపోయిన కోళ్లను రోడ్లపై వేయడంతో కుక్కలు గుంపులు గుంపులుగా వచ్చి చనిపోయిన కోళ్లను తినడంతో పిచ్చి కుక్కలు గా మారుతున్నవి అని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళలో ఏడుస్తూ శబ్దాలు చేస్తున్నాయి అని కొంతమంది తెలిసి తెలియక కుక్కలను పెంచుకొని ఇంట్లో బెల్టుతో కట్టి వేయకుండా వీధిలోకి వదులుతున్నారని,
వాటి కోసం వీధి కుక్కలు కాలనీలోకి వస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఏ అధికారి కి చెప్పా లో అనే సందిగ్ధం తో ప్రజలు ఉన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు మున్సిపల్ పరిధిలోన కుక్కల బెడద లేకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.