సీఎం కు బెయిల్ మంజూరు…. ఢిల్లీ లిక్కర్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట దొరికింది. ఈ కేసులో గురువారం ఆయనకు బెయిల్ మంజూరు అయింది.బెయిల్ పొందిన కేజ్రీవాల్ రూ. 1 లక్ష రూపాయల పూచీకత్తను సమర్పించాలని ప్రత్యేక న్యాయమూర్తి నియాయ్ బిందు ఆదేశాలను జారీ చేశారు. 48 గంటల పాటు బెయిల్‌ ఆర్డరును నిలిపివేయాలని ఈడీ తరపున న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఈడీ చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ తరపు …

సీఎం కు బెయిల్ మంజూరు….

ఢిల్లీ లిక్కర్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట దొరికింది. ఈ కేసులో గురువారం ఆయనకు బెయిల్ మంజూరు అయింది.బెయిల్ పొందిన కేజ్రీవాల్ రూ. 1 లక్ష రూపాయల పూచీకత్తను సమర్పించాలని ప్రత్యేక న్యాయమూర్తి నియాయ్ బిందు ఆదేశాలను జారీ చేశారు.

48 గంటల పాటు బెయిల్‌ ఆర్డరును నిలిపివేయాలని ఈడీ తరపున న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఈడీ చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.

అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాది సంబంధిత కోర్టు ఎదుట రేపు బెయిల్ బాండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని న్యాయస్థానం పేర్కొంది.

ఈ కేసులో మార్చి 21న ఈడీ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రచారం చేసేందుకు వీలుగా తాత్కాలిక బెయిల్ రాగా… ప్రచారం నిర్వహించిన అనంతరం కేజ్రీవాల్ తిరిగి జైలుకు వెళ్లారు.

Updated On 20 Jun 2024 9:51 PM IST
cknews1122

cknews1122

Next Story