రైతులకు శుభవార్త.. రుణమాఫీ కి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ TG: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీకి సీఎం రేవంత్ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న రుణాలను ఏక కాలంలో మాఫీ చేయాలని నిర్ణయించింది. కాగా పంట రుణాల మాఫీకి రూ.40 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే రూ. 2లక్షల రుణ మాఫీకి కటాఫ్ తేదీని నిర్ణయించింది. 2023 డిసెంబర్ 9కి ముందు …

రైతులకు శుభవార్త..

రుణమాఫీ కి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్

TG: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీకి సీఎం రేవంత్ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది.

2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న రుణాలను ఏక కాలంలో మాఫీ చేయాలని నిర్ణయించింది.

కాగా పంట రుణాల మాఫీకి రూ.40 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు.

ఈ క్రమంలోనే రూ. 2లక్షల రుణ మాఫీకి కటాఫ్ తేదీని నిర్ణయించింది. 2023 డిసెంబర్ 9కి ముందు రెండు లక్షల వరకు పంట రుణం తీసుకున్న వారికి లోన్ మాఫీ చేయాలని కటాఫ్ డేట్ ఫిక్స్ చేసింది.

ఏకకాలంలో పంట రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి రుణమాఫీ విధివిధానాలను ప్రకటించనున్నారని సమాచారం.

ఆగస్ట్ 15వ తేదీ లోపు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఛాలెంజ్ చేసిన నేపథ్యంలో.. జూలై చివరి వారం నుండి మాఫీ ప్రాసెస్ మొదలుపెట్టి.. ఆగస్ట్ 15 నాటికి కంప్లీట్ చేసేలా సర్కార్ ప్రణాళికలు తయారు చేసినట్లు సమాచారం.

ఇందుకోసం రాష్ట్ర ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ నిధులను కూడా సమీకరిస్తోన్నట్లు తెలుస్తోంది. కాగా, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే తెలంగాణలో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్.. హామీ ఇచ్చినట్లుగా రూ.2 లక్షలు రుణమాఫీ అమలుకు కసరత్తు మొదలుపెట్టింది. రెండు లక్షల రుణమాఫీ అమలుకు సీఎం రేవంత్ రెడ్డి ఆగస్ట్ 15 డెడ్ లైన్ పెట్టడంతో ఆ లోగా ఈ ప్రాసెస్ పూర్తి అయ్యేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఇప్పటికే అధికారులు మహారాష్ట్ర, రాజస్థాన్ వెళ్లి అక్కడ అధ్యయనం చేసి నివేదిక సమర్పించారు. ఈ కేబినెట్ మొత్తం రైతులకు సంబంధించిన ప్రయోజనాలపైనే ఎక్కువగా చర్చించనున్నారు.

Updated On 21 Jun 2024 6:15 PM IST
cknews1122

cknews1122

Next Story