మాజీ సీఎం భార్య పీఏ అరెస్ట్? ఏపీలో ఘోర పరాభవం తర్వాత మాజీ సీఎం జగన్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు శనివారం తెల్లవారు జామున కూల్చివేశారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే మాజీ సీఎం జగన్ సతీమణి భారతి పీఏ వర్రా రవీంద్రరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ షర్మిల, సునీతారెడ్డి, హోంమంత్రి వంగలపూడి అనితలపై సోషల్ మీడియాలో …

మాజీ సీఎం భార్య పీఏ అరెస్ట్?

ఏపీలో ఘోర పరాభవం తర్వాత మాజీ సీఎం జగన్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు శనివారం తెల్లవారు జామున కూల్చివేశారు.

ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే మాజీ సీఎం జగన్ సతీమణి భారతి పీఏ వర్రా రవీంద్రరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ షర్మిల, సునీతారెడ్డి, హోంమంత్రి వంగలపూడి అనితలపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టినట్లు తెలుస్తోంది.

పోస్టులు పెట్టడంతో పాటు అసభ్యకరమైన కామెంట్స్ చేసినట్లు తెలిసింది. చంద్రబాబు, పవన్ కుటుంబసభ్యులపై సైతం అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్లు సమాచారం.

వరుస ఆరోపణల నేపథ్యంలో వైఎస్ భారతి పీఏ రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. కడప నుంచి కదిరి వెళ్లే మార్గమధ్యలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అరెస్ట్‌పై పోలీసులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

Updated On 22 Jun 2024 11:26 AM IST
cknews1122

cknews1122

Next Story