బ్యాంకు లాకర్ లో నగలు మాయం
సుమారు 15 తులాల బంగారపు వస్తువులు మాయం
సీ కే న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునిర్.
సత్తుపల్లి పట్టణ పరిధిలోని తోట వెంకటరావు వీధిలో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఎంప్లాయ్ సర్దార్ షరీఫ్ కుమార్తె ఎండి ఫరాజ్, గత కొంతకాలం నుంచి హైదరాబాదులో నివాసం ఉంటూ 11 ఏళ్లుగా సత్తుపల్లి లో ఓ ప్రైవేట్ బ్యాంకులో లాకర్ తీసుకొని రన్ చేస్తున్న క్రమంలో గత ఏడాది ఆగస్టు 2 .2023. తేదీన ఎండి.ఫరాజ్ తమ వద్ద 4.గాజులు. నల్లపూసల తాడు,1 4.ఉంగరాలు. నక్లెస్ 1.తోపాటు కొన్ని వెండి వస్తువులను బ్యాంకు లాకర్లో భద్రపరిచి తిరిగి హైదరాబాదుకు వెళ్ళింది.
సదురు బ్యాంక్ మేనేజర్ ఈనెల జూన్ 12 వ తేదీన 2024. యం డి.పరాజ్ ,కు ఫోన్ చేసి మీ లాకర్ బయటకు వచ్చినట్లు కనిపిస్తుంది. బ్యాంకు ను సందర్శించి లాకర్ ను చెక్ చేసుకోవాలని ఆమెకు ఫోన్ లో సమాచారం అందించారు,
సదరు మహిళ ఈనెల 18 వ తేదీ న బక్రీద్ పండుగను పురస్కరించుకొని సత్తుపల్లి కి వచ్చిన మహిళ 19 వ తేదీన బ్యాంకుకు వెళ్లి లాకర్ ను పరిశీలించగా లాకర్ లో ఉన్న సుమారు 15 తులాల వివిధ రకాల బంగారపు వస్తువులు మాయమైనట్లు, కేవలం వెండి వస్తువులు మాత్రమే లాకర్లో ఉన్నట్లు గుర్తించి, సదరు మహిళ బ్యాంక్ మేనేజర్ ను నిలదీయక బ్యాంక్ మేనేజర్ మహిళను బుకాయిస్తూ మీరే మధ్యలో వచ్చి నగదు తీసుకెళ్ళి ఉంటారని బనాయించడంతో తో సదరు మహిళ స్థానిక సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేయగా ఫిర్యాదు సేకరించిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.