డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయం ముందు జంట ఆత్మహత్యాయత్నం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించి పాలన మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
ఏపీలో ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేసి పనిచేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం కూడా తెలిసిందే.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలను వింటూ వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులను, పోలీసులను పరుగులు పెట్టిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయం ముందు ఓ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. తమకు ఉన్న 1200 గజాల భూమిని ఒక మహిళా కార్పొరేటర్ కబ్జా చేశారని ఆరోపిస్తూ ఓ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
రాజమండ్రిలో ఒక వైసిపి మహిళా కార్పొరేటర్ తమ 1200 గజాల భూమిని కబ్జా చేశారని, ఆరోపిస్తున్న వారు అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయిందని వాపోయారు.
ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారటంతో పవన్ కళ్యాణ్ తమ సమస్య పరిష్కరిస్తారని కొండంత ఆశతో పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ తమ సమస్యను పరిష్కరిస్తారని నమ్మకంతో అక్కడికి వచ్చామని తెలిపారు.
పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయం ముందు భవనం పైకెక్కి, తమ భూమిని వైసీపీ కార్పొరేటర్ కబ్జా చేశారని వారు ఆత్మహత్య ప్రయత్నం చేశారు.
దీంతో స్థానికులు వారిని అడ్డుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యను పవన్ కళ్యాణ్ పరిష్కరించాలని, తమకు న్యాయం చేయాలని తమ సమస్యలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లడానికి ఈ విధంగా ఆత్మహత్యాయత్నం చేశామని బాధిత జంట చెబుతున్నారు. అసలు ఆత్మహత్యా యత్నం చేసిన జంట ఎవరు? భూమి కబ్జా చేసిన వైసీపీ నాయకురాలెవరు? వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.