ఏ క్షణంలోనైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్
గచ్చిబౌలిలోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. 2024, జూన్ 26వ తేదీ బుధవారం తెలంగాణ భవన్ నుంచి ఫిలింనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ర్యాలి చేస్తానని కౌశిక్ రెడ్డి ప్రకటించారు.
ఎలాగైనా తెలంగాణ భవన్ కు చేరుకుంటాని చెప్పడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పై కూడా ఎమ్మెల్యే కౌశిక్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
అయితే, గచ్చిబౌలిలోని కౌశిక్ రెడ్డి ఇంటికి… పోలీసులు వచ్చే సమయానికి ఆయన ఇంట్లో లేరని తెలుస్తోంది. కౌశిక్ రెడ్డిని ఏ క్షణమైన అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఫ్లై యాష్ తరలింపు విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ రూ. వంద కోట్ల అవినీతికి పాల్పడ్డారని కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై స్పందించిన మంత్రి పొన్నం.. కౌశిక్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కౌశిక్ రెడ్డితోపాటు ఆ వార్త ప్రసారం చేసిన టీ న్యూస్ ఛానెల్, టీ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ జోగినపల్లి సంతోష్ కుమార్, నమస్తే తెలంగాణ దిన పత్రిక చీఫ్ ఎడిటర్ తీగుళ్ల కృష్ణమూర్తి, తెలంగాణ పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి లీగల్ నోటీసులు ఇచ్చారు