
జూలై 29 లోగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకోవాలి…. ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్
3వ తరగతిలో ప్రవేశం కొరకు గిరిజన ఎరుకుల విద్యార్థినీ, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి
జూలై 29 లోగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నందు 3వ తరగతిలో ఎరుకుల జనరల్ క్యాటగిరిలో ప్రవేశం కొరకు గిరిజన విద్యార్థిని, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
2025-26 సంవత్సరానికి ఖమ్మం జిల్లాకు చెందిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో అర్హులైన గిరిజన విద్యార్థిని, విద్యార్థులకు 3వ తరగతిలో ఎరుకల జనరల్ క్యాటగిరిలో ఒక సీటు కేటాయించడం జరిగిందని, ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకొని ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, జూలై 31న మధ్యాహ్నం 12 గంటలకు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అధ్యక్షతన భద్రాచలం ఆఫీసు నందు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను లాటరీ పద్ధతిన ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
ఒక కుటుంబం నుంచి ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేయి విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో లక్ష యాభై వేల రూపాయల లోపు ఉండాలని అన్నారు.
దరఖాస్తుకు కుల, నివాస ధృవీకరణ పత్రం, గత సంవత్సరం చదివిన పాఠశాల స్టడీ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు జత చేయాలని, ఆసక్తి గలవారు జూలై 29 సాయంత్రం ఐదు గంటల లోపు ఉప సంచాలకులు, గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం, రూమ్ నెంబర్ ఎస్ – 30 సమీకృత జిల్లా కలెక్టరేట్ ఖమ్మం నందు దరఖాస్తులను సమర్పించాలని ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.