PoliticalTelangana

తాగిన మైకంలో భర్తను హతమార్చిన భార్య…

తాగిన మైకంలో భర్తను హతమార్చిన భార్య…

తాగిన మైకంలో భర్తను హతమార్చిన భార్య…

నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ముమ్మాయిపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం…మమ్మాయిపల్లి గ్రామానికి చెందిన నక్క నాగయ్య (48), భార్య లక్ష్మి ఇద్దరికి 30 ఏళ్ల క్రితం వివాహమైంది.

ఇద్దరు తాగుడుకు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో సోమవారం తాగిన మైకంలో లక్ష్మి భర్త నాగయ్య ఇద్దరు గొడవ పడ్డారు. లక్ష్మీ కోపోద్రేకంతో పక్కనే ఉన్న గొడ్డలి తీసుకొని తల భాగంలో నరికింది.

గ్రామస్తులు వెంటనే నాగయ్య ను 108 సహాయంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. భార్య లక్ష్మిని బిజినపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నాగయ్య పరిస్థితి విషమంగా ఉందని గాంధీ ఆసుపత్రికి తీసుకు వెళుతుండగా మార్గ మధ్యలో చనిపోయాడు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button