జూలై 1 నాడు జరిగే నేషనల్ గోర్ బంజారా సమ్మేళనం ను విజయ వంతం చేయండి — సికె న్యూస్ ప్రతినిధి LHPS స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ భానోత్ సునిల్ నాయక్ ఈ రోజు స్థానికంగా రాంనగర్ లోని డిపో తండా REC తండా లలో 1 జూలై హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో LHPS వ్యయస్థాపక అధ్యక్షులు బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో జరిగే జాతీయ గోర్ బంజారా సమ్మేళనం యొక్క కరపత్రాలు ఆవిష్కరణ చేయడం …

జూలై 1 నాడు జరిగే నేషనల్ గోర్ బంజారా సమ్మేళనం ను విజయ వంతం చేయండి —

సికె న్యూస్ ప్రతినిధి

LHPS స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ భానోత్ సునిల్ నాయక్ ఈ రోజు స్థానికంగా రాంనగర్ లోని డిపో తండా REC తండా లలో 1 జూలై హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో LHPS వ్యయస్థాపక అధ్యక్షులు బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో జరిగే జాతీయ గోర్ బంజారా సమ్మేళనం యొక్క కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరిగింది

ఈ కార్యకమాన్ని ఉద్దేశించి LHPS స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ భానోత్ సునిల్ నాయక్ మాట్లాడుతూ మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లలో లంబాడి లు ఒక్కతాటి పై వచ్చి కాంగ్రెస్ కి గుంప గుత్త గా ఓట్లు వేసినరాని చెప్పినారు

అందుకే జనరల్ స్థానాలు అయినా పాలకుర్తి, నర్సంపేట,వర్ధన్నపేట, హుస్నాబాద్,హుజుర్నగర్, జెడ్చర్ల, మిర్యాలగూడ, కల్వకుర్తి, పాలే రు, నర్సాపూర్,ఆలేరు, మునుగోడు, కామారెడ్డి, నారాయణఖేడ్, జాహిరాబాద్,మెదక్, పరిగి, తాండూర్, నిర్మల్, బాన్సవాడ, దాదాపుగా మన రిజర్వేషన్ 12 స్థానాలతో పాటు ఇతర 20 స్థానాలల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది అంటే మన లంబాడి లు ఎంత ఐక్యమాతంతో ఉన్నారో నిరూపించు కోవడం జరిగింది

భారతదేశం లోని అన్ని రాష్టాల లంబాడిలు ఈ ప్రోగ్రాం లో పాల్గొంటున్నారు లంబాడి లా ఐక్యత చాటుతూ రాజ్యాంగం లో 8 షెడ్యూల్ లో గోర్ బోలి బాషాను ప్రవేశ పెట్టె తీర్మాణానికి తెలంగాణ నుంచే భవిష్యత్ కార్యాచరణ రూపొందించుతున్నారు

కాబట్టి మన చీఫ్ మినిస్టర్ గారు శ్రీ ఏనుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిధి గా 1 జులై అంటే ఎల్లుండి రవీంద్ర భారతి కి ముఖ్య అతిధి గా విచ్చేస్తున్నారు సీఎం గారితో పాటు 8 గురు పార్లమెంట్ సభ్యులు మన తెలంగాణ మంత్రులు తో పాటు గిరిజన MLA లు అందరు వస్తున్నారు

కాబట్టి ఈ బంజారా సమ్మేళనం నీ విజయ వంతం చేయాలనీ పిలుపు నిచ్చినారు మన ముఖ్య మైన డిమాండ్ గోర్ బోలి భాషను రాజ్యాంగం లోని 8 షెడ్యూల్ లో చేర్చాలని మన ప్రియతమా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు చెప్పుతున్నాము

ఈ కార్యక్రమం లో LHPS యూత్ ప్రెసిడెంట్ భానోత్ ప్రవీణ్ నాయక్ LHPS రాష్ట్ర నాయకులు తిరుపతి నాయక్ రమేష్ నాయక్ జిల్లా ఆధ్యాక్సులు శ్రీను నాయక్ మహేష్,రవి,కాస్నా, గంగు, రూప, నీరజ, కాంతి, నాగు, తో పాటు తండా వాసులు పాల్గొన్నారు

Updated On 29 Jun 2024 5:16 PM IST
cknews1122

cknews1122

Next Story