ఫరారీలో పంచాయతీ కార్యదర్శి..?
10 లక్షల పంచాయతీ నిధుల దుర్వినియోగం విచారణ కోరిన గిరిజన సంక్షేమ సంఘం
పాలేరు, జూన్ ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం మండల పరిధి లోని బచ్చోడు తండా గ్రామ పంచాయతి కార్యదర్శి ప్రసన్నకుమార్, మాజీ సర్పంచ్ కుమ్మక్కై నిధులను దుర్వినియోగం చేసారనీ వారీపై క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని గిరిజన సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్, యువజన కాంగ్రెస్ నాయకులు గుగులోత్ సురేష్ నాయక్, జిల్లా పంచాయతీ శాఖ అధికారులను కోరారు. గ్రామ అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను మాజీ సర్పంచ్, కార్యదర్శి ఇద్దరు కలిసి దుర్విని యోగం చేశారని వారి ఇద్దరు ప్రస్తుతం పరారీలో ఉన్నారని వారిపై తక్షణమే విచారణ జరిపించి గ్రామపంచాయతీలో దుర్వీనియోగ పరిచిన నిధులను రికవరి చేయాలనీ జిల్లా ఉన్నతాధికారులను కోరారు.
ఇదే విషయాన్ని మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికీ తీసుకేళ్తామనీ దాదాపు 10లక్షల నిధులను ఇద్దరు కుమ్మక్కయి దుర్వినియోగం చేశారని, పంచాయతీ కార్యదర్శి గత రెండు నెలల నుండి గ్రామాల్లో కనబడకుండా పోయారనీ,
జిల్లా ఉన్నతాధికారులు, మండల అధికారులు, పత్రీక విలేఖరులు, గ్రామ ప్రజలు కార్యదర్శి ప్రసన్నకుమార్ కీ ఫోన్ చేసిన కనీసం స్పందించడం లేదని తక్షణమే పంచాయతీ కార్యదర్శి ప్రసన్నకుమార్పై క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు విచారణ జరిపించి వారిపై చర్యలు తీసుకోవాలని, అంతే దినసరి వర్కర్లతో పనీ చేపించుకునీ కులీ డబ్బుల ఇవ్వలేదనీ, వర్కర్లు ఫోన్ చేసిన జిల్లా కో ఆర్డినేటర్ స్పందించడం లేదని, ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్పందించడం లేదని. గ్రామంలో ఎలాంటి సర్టిఫికెట్ తీసుకోవాలన్న, ఇంటి పన్ను కోసం ప్రజలు మండల కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారనీ, ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి పంచాయతీ కార్యదర్శిని ఉద్యోగం నుంచి బర్తాఫ్ చేయాలని కోరారు.