PoliticalTelangana

వైద్యం వికటించి చనిపోయిందని ఆందోళన

వైద్యం వికటించి చనిపోయిందని ఆందోళన

తమ బిడ్డ వైద్యం వికటించడం వల్ల చనిపోయిందని ఆరోపిస్తూ ఓ ప్రైవేట్​హాస్పిటల్​ఎదుట మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నాకు దిగారు.ఈ సంఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో జరిగింది.

స్థానికుల కథనం ప్రకారం.. కుకునూర్​పల్లి మండలంలోని మంగోల్​ గ్రామానికి చెందిన మెడబోయిన కల్యాణి(19) గజ్వేల్​లోని ఓ ప్రైవేట్​హాస్పిటల్​లో నర్సుగా పనిచేస్తుంది. గురువారం ఆమె తీవ్ర అస్వస్తతకు గురవడంతో ఆమె పనిచేస్తున్న హాస్పిటల్​లోనే వైద్యం అందించారు.

పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​హాస్పిటల్​కు తరలించగా చికిత్స పొందుతూ రాత్రి చనిపోయింది.

శుక్రవారం ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులతో కలసి గజ్వేల్​లో ఆమెకు మొదట వైద్యం చేసిన ప్రైవేట్​హాస్పిటల్​వద్దకు వచ్చి వైద్యం వికటించిన కారణంగానే తమ బిడ్డ ప్రాణం పోయిందని ఆరోపిస్తూ హాస్పిటల్​ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

విషయం తెలుసుకున్న పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులు, హాస్పిటల్​యాజమాన్యంతో మాట్లాడి వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి వెళ్లారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button