డ్రైనేజీ సమస్య తీరేది ఎప్పుడో..?
*సి కె న్యూస్, వాజేడు మండల ప్రతినిధి షేక్ రహీమ్ *
ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని అయ్యవారిపేట గ్రామపంచాయతీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. వర్షాకాలం వస్తే, చాలు ఎటు చూసినా డ్రైనేజీ వీధుల్లో ప్రవ హిస్తూనే ఉంటుంది. చెత్తకుప్పలైతే గుట్టలు గుట్టలు దర్శనమిస్తూ ఉంటాయి.
దీంతో నిత్యం ప్రజలు దుర్వాసనతో, రోగాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేవారు లేరా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో పంచాయతీ సిబ్బందికి చలనం కలిగింది.
దీనితో తాత్కాలికం గా సైడ్ కల్వలాగా తీశారు. తగినన్ని నిధులు లేకపోయినప్పటికీ ఇసుక ర్యాంపులో గ్రామాభివృద్ధి కోసం వసూలు చేసిన నిధులతో ఈ పనులు చేపట్టామని పంచాయతీ కార్యదర్శి పేర్కొన్నారు.
పంచాయతీ కార్యదర్శి అనిల్, గుమ్మస్తా కాట సురేష్, గ్రామస్తులు పాల్గున్నారు.