తాగొచ్చిన సారు, ఆలస్యంగా బడికి వచ్చే టీచర్లు... ● పిల్లలను బడికి పంపేదెలా? ● నిలదీసిన యువకుడి వీడియో వైరల్‌ కొత్తగూడ: 'మద్యం తాగి సారు.. ,11 గంటలకు టీచర్లు వస్తే మా పిల్లలను బడికి ఎలా పంపాలి' అంటూ ఓ యువకుడు నిలదీసిన వీడియో శనివారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం కొత్తపల్లి గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న ఈక నారాయణ రెండ్రోజుల …

తాగొచ్చిన సారు, ఆలస్యంగా బడికి వచ్చే టీచర్లు...

● పిల్లలను బడికి పంపేదెలా?

● నిలదీసిన యువకుడి వీడియో వైరల్‌

కొత్తగూడ: 'మద్యం తాగి సారు.. ,11 గంటలకు టీచర్లు వస్తే మా పిల్లలను బడికి ఎలా పంపాలి' అంటూ ఓ యువకుడు నిలదీసిన వీడియో శనివారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం కొత్తపల్లి గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న ఈక నారాయణ రెండ్రోజుల క్రితం బాగా మద్యం తాగి పాఠశాలకు వచ్చాడు. గమనించిన స్థానిక యువకుడు సదరు ఉపాధ్యాయుడిని నిలదీస్తూ వీడియో తీశాడు.

మద్యం తాగి సారు.. ఆలస్యంగా టీచర్లు బడికి వస్తే తమ పిల్లలను ఎలా పాఠశాలకు పంపించాలని ప్రశ్నించాడు. అందుకే కొందరు పొగుళ్లపల్లి పాఠశాలకు, మరి కొందరు ప్రైవేట్‌ పాఠశాలకు పంపిస్తున్నారని చెప్పారు. కాగా వీడియో రికార్డు చేయొద్దంటూ పాఠశాల హెచ్‌ఎం జగ్గారావు యువకుడిని వారించాడు.

అది కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో చర్చనీయాంశమైంది. ఈ విషయమై ఏటీడీఓ భాస్కర్‌ను వివరణ కోరగా విషయం తెలిసిందని, పే యూనిట్‌ హెచ్‌ఎం దేవదాస్‌ ను పంపి విచారించి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు.

Updated On 30 Jun 2024 1:43 PM IST
cknews1122

cknews1122

Next Story