మొబైల్ కోర్టు ఆదేశాలను కొట్టేసిన హైకోర్టు..!!
రెండేళ్ల పోరాటం తర్వాత ఊకె రాజేంద్ర ప్రసాద్ విజయం
బాధితుడికి అండగా నిలిచిన హైకోర్టు అడ్వకేట్ వై.సోనాంజలి
అండగా నిలిచిన పాత్రికేయులకు స్థానిక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన బాదితులు
భద్రాద్రి కొత్తగూడెం సి కె న్యూస్ జులై 2: తప్పుడు పత్రాలను సృష్టించి కోర్టును తప్పుదోవ పట్టించి అన్యాయంగా భూమిని కబ్జా చేయాలని చూసిన కేసులో రాజాపురం గ్రామానికి చెందిన ఊకే రాజేంద్ర ప్రసాద్ ఎట్టకేలకు విజయం సాధించారు.
మడి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఈ భూమిని కాజేయడానికి చేసిన ప్రయత్నాలన్ని విఫలమయ్యాయి. తప్పుడు పత్రాలను సృష్టించి మొబైల్ కొర్టు ద్వారా భూమిని కాజేయాలనే దురాలోచనతో తాత్కాలిక ఆదేశాలను తెచ్చుకున్నా ఊకే రాజేంద్ర ప్రసాద్ తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో మొబైల్ కొర్టు ఆదేశాలను సవాలు చేశాడు.
ఈ కేసు విషయంలో ప్రతివాది తెలంగాణ హైకోర్టులో కూడా తప్పుడు పత్రాలను సమర్పించారు. అయితే తెలంగాణ హైకోర్టు అసలు మొబైల్ కోర్ట్ ఇచ్చిన ఆదేశాలనే చెల్లవని స్పష్టం చేసింది. మొబైల్ కోర్టు ఇచ్చిన టెంపరరీ ఇంజక్షన్ ఆర్థర్ ని తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేయడంతో ఊకె రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించారు.
ప్రతివాది అయిన మడి వెంకటేశ్వర్లు గౌరవ తెలంగాణ హైకోర్టుకు కూడా తప్పుడు పత్రాలను సమర్పించడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో మొదట హైకోర్టు స్టే విధించింది. దీనిపై ప్రతివాది స్టే ని తొలగించాలని హైకోర్టుని ప్రాధేయపడినా తెలంగాణ హైకోర్టు మాత్రం నిర్ద్వందంగా తోసిపుచ్చింది.
సినిమా ఫక్కీలో కీలక మలుపులు
రాజాపురం భూ వివాదంలో బాధితులు పడిన కష్టాలు అన్ని ఇన్ని కావు. సినిమాల్లో కూడా ఇలాంటి అనుభవాలు కనబడవంటే అతిశయోక్తి కాదు. దొంగ దస్తావేజులు సృష్టించి రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని బయటకు వెళ్లగొట్టాలని తీవ్రమైన ఒత్తిడికి గురి చేశారు.
సినిమా ఫక్కీలో ఎయిర్ గన్ తీసుకువచ్చి గుండెలపై గురి పెట్టి బయటకు వెళ్ళకపోతే కాల్చి చంపుతామంటూ మడి వెంకటేశ్వర్లు కొడుకు మడి వినోద్ బాధితులను తీవ్రంగా బెదిరించడం ములకలపల్లి మండలంలో సంచలనం కలిగించింది.
భూమి కోసం తుపాకులతో బెదిరించడం చూసి ఏజెన్సీ వాసులు భయాందోళనలకు గురయ్యారు. మండల ప్రజలు తుపాకి సంస్కృతి ఇక్కడ కూడా ఆరంభమైందేమో అని ఆశ్చర్య పడ్డారు. అంతేకాదు మండల వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజం కూడా పాస్టర్లకు తుపాకులు ఎలా వచ్చాయో అని ముక్కున వేలేసుకున్నారు.
ఒక్కసారిగా తుపాకులతో బెదిరించేసరికి రాజేంద్ర ప్రసాద్ కుటుంబం మరియు వారికి అండగా ఉన్న స్థానిక గ్రామ ప్రజలు భయపడిపోయారు. ఐతే ధైర్యం తెచ్చుకున్న గ్రామస్తులు ప్రతిఘటించడంతో మడి వెంకటేశ్వర్లు మడి వినోద్ సోయం సునీల్ సహా వారి అనుచరులు పదిమంది వెంట తెచ్చుకున్న కార్లలో పరారయ్యారు. దీంతో ఊకె రాజేంద్ర ప్రసాద్ కుటుంబం ఊపిరి పీల్చుకుంది.
ఐతే మడి వెంకటేశ్వర్లు మళ్ళీ తాను సృష్టించిన దొంగ దస్తావేజులతో తప్పుడు పద్ధతుల్లో మొబైల్ కోర్టు నుండి టెంపరరీ ఇంజక్షన్ ఆర్థర్ తెచ్చుకుని బాధితులపై మళ్ళీ వేధింపులకు దిగాడు. దీంతో గత్యంతరం లేక ఊకె రాజేంద్ర ప్రసాద్ తెలంగాణ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ కేసులో బాదితుని తరఫున హైకోర్టు న్యాయవాది వై.సోనాంజలి తమ వాదనలు వినిపించారు.
మొదటగా మడి వెంకటశ్వర్లు తెచ్చుకున్మ తప్పుడు మొబైల్ కోర్టు ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. ఈ స్టే ఆర్థర్ ను తీసివేయాలని ప్రతివాదులు ఎన్ని విధాల ప్రయత్నాలు చేసినా హైకోర్టు దానికి అనుమతించలేదు మరియు బాధితులకు అండగా నిలబడింది.
చిట్టచివరకు భద్రాచలం మొబైల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో ఊకె రాజేంద్ర ప్రసాద్ కుటుంబం సంతోషం వ్యక్తం చేసారు. బాధితుల తరఫున హై కోర్టులో వాదనలు వినిపించిన హైకోర్టు న్యాయవాది వై.సోనాంజలికి రాజేంద్ర ప్రసాద్ కుటుంబం తమ కృతజ్ఞతలు తెలిపారు.