EducationPoliticalTelangana

ఒంటిపూట బడులు ఎప్పటి నుంచి అంటే…

ఒంటిపూట బడులు ఎప్పటి నుంచి అంటే...

రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు

రోజురోజుకు ఎండ తీవ్రమవుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులను నడపాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది.

ఈ నెల 15 నుంచి రాష్ట్రంలోని బడులను ఒంటిపూట మాత్రమే నిర్వహిస్తారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఏప్రిల్‌ 23 వరకు ఒంటిపూట బడులను నిర్వహిస్తారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బడులు ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12 : 30 గంటల వరకు కొనసాగుతాయి.

విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని మధ్యాహ్నం 12 : 30 గంటల సమయంలో అందజేస్తారు. పదో తరగతి పరీక్షల సమయంలో పరీక్షాకేంద్రాలున్న బడుల్లో మాత్రం మధ్యాహ్నం పూట స్కూళ్లను నిర్వహిస్తారు.

వీరికి తొలుత మధ్యాహ్నం భోజనం అందజేసి ఆ తర్వాత తరగతులు కొనసాగిస్తారు. పది పరీక్షలు ముగిసిన తర్వాత మళ్లీ ఉదయం పూటే ఆయా బడులు నడుస్తాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button