అశ్వారావుపేట ఎస్సై మరణ వాగ్మూలం వీడియో
పై స్థాయి అధికారి, స్టేషన్ లో సిబ్బంది వేధింపులకు ఏకంగా ఓ ఎస్సై ప్రాణం బలైపోయింది. గత నెల జూన్ 30 న మహబూబాబాద్ పట్టణంలో ఆత్మహత్య చేసుకున్న అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ హైదారాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు.
శ్రీనివాస్ స్వస్థలం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నరక్కపేట గ్రామం. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
వీడియో https://www.facebook.com/share/v/9n7KX5RDA7fhEDvK/?mibextid=xfxF2i
ఈ ఘటనపై ఇప్పటికే సీఐ జితేందర్‌రెడ్డి, పోలీసు కానిస్టేబుళ్లు సన్యాసినాయుడు, సుభాని, శేఖర్, శివనాగరాజుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. ఎస్సై శ్రీరాములు శ్రీను భార్య కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పై అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాస్ మృతితో ఎలాంటి ఆందోళన జరగకుండా పోలీసులు ఆయన మిత్రులు, ప్రతిపక్ష, వామపక్ష, దళిత సంఘాల నేతలను ముందస్తు అరెస్ట్ చేసినట్లు సమాచారం.