మాదిగ అమరవీరులకు ఘన నివాళులు
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి.
మాదిగ అమరుల త్యాగం మరువలేనిది.
తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) జూలై 7
ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు మోడీ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలని తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాదులోని లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని పురస్కరించుకొని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి, మాదిగ అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు.
30 ఏళ్లుగా ఎస్సీ ఏ బి సి డి వర్గీకరణ కోసం మాదిగలు మాదిగ ఉపకులాల ప్రజలు పోరాటం చేస్తుంటే కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎన్నికల ముందు మాదిగల ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాక మొహం చాటేస్తున్నారని మండిపడ్డారు .
30 ఏళ్ల వర్గీకరణ పోరాటంలో తెల్లబండ్ల రవి, నడిమిట్టి దామోదర్, ములుగు మహేష్, దర్శనాల భారతి, సిర్ర నాగేశ్వరరావు, మీరా సాహెబ్, పెద్దడా ప్రకాష్ రావు, ప్రభాకర్ వంటి అమరులు అమరత్వం పొందారని వారి త్యాగం మరువలేనిదని కొనియాడారు.
ఎస్సీ వర్గీకరణ అమల య్యేంతవరకు, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం పోరాటం చేస్తుందని అన్నారు .
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ సలహాదారులు సుంచు లింగయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు పానుగంటి సురేందర్, రాష్ట్ర కార్యదర్శులు చుక్క అశోక్, దుబ్బ నాగేష్, పెద్దింటి శ్రీనివాస్, రాష్ట్ర కోశాధికారి మహంకాళి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు ఒగ్గు సోమయ్య, చింత ప్రవీణ్ ,బొల్లె రాజన్న,వస్కుల జయరాజ్, కనుకు రవి ,లక్ష్మణ్, జానీ, సుధాకర్, మహేష్, బిక్షం, నాగయ్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.