మాట తప్పని మడమ తిప్పని నాయకుడు వైయస్ అర్
వైయస్ సంక్షేమ పథకాలు 100 ఏండ్లు గుర్తింపు
బడుగు బలహీనవర్గాల పెన్నిధి వైయస్ఆర్
ఎన్నారై తిరుమలరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య (జయజాజ్) జూలై 08
మాట తప్పని మడమ తిప్పని నాయకుడు వైయస్ అర్ అని వైయస్ సంక్షేమ పథకాలు ప్రజల్లో వందేళ్లు గుర్తింపు ఉంటాయని బడుగు బలహీన వర్గాల పెన్నిధి వైయస్ రాజశేఖర్ రెడ్డి అని ఎన్నారై తిరుమలరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు.
మఠంపల్లి మండల కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు శుభోదయ యువజన సంఘం అధ్యక్షులు గాదె జయభరత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆనాడు వృద్ధులు వికలాంగులు వితంతువులు వారి సొంత పింఛన్ డబ్బులతో వైయస్ మీద అభిమానంతో గ్రామంలో ఏర్పాటుచేసిన వైయస్సార్ విగ్రహం ముందర వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఇట్టి కార్యక్రమానికి ఎన్నారై తిరుమలరెడ్డి ప్రవీణ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ఒక మనిషి 100 ఏళ్ళు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్ళు బ్రతకాల్సిన పనిలేదని అతను సాధించిన విజయాలే అతను ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే అతన్ని వందేళ్లు బ్రతికిస్తాయని ఆ మాటకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిదర్శనమని ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఎన్నెన్నో సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచేలా పేదలకు అందించారని వాటిలో 108 సర్వీస్ పేద పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ రైతు రుణమాఫీ ఉద్యోగాల కల్పన పింఛన్లు ఉచిత కరెంటు పేద పిల్లలకు గుండె ఆపరేషన్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో సంక్షేమ పథకాలు అందించిన మహానేత వైఎస్ ఇప్పుడు సజీవంగా మన మధ్యలో లేకపోయినా ఆయన చేసిన పనులు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అలాంటి మహానేత జయంతి మఠంపల్లి లో ఘనంగా జరుపుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయం అని ప్రపంచ దేశాలలో వైయస్ అభిమానులు ఎందరో ఉన్నారని నేను ఇతర దేశంలో స్థిరపడ్డ జన్మనిచ్చిన నా ఊరిలో నా ఆత్మీయుల మధ్య నా ఇంటి ముందర మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు ఆదూరి స్రవంతి కిషోర్ రెడ్డి, కొత్త పల్లి కృపానందం, కర్నె వెంకన్న, గోపు బాల్ రెడ్డి, తిరుమలరెడ్డి బాల్ రెడ్డి, ఆదూరి మధుసూదన్ రెడ్డి, దగ్గుపాటి మహేష్, కందుల అశోక్, క్రాంతి కుమార్, ఆదూరి మర్రెడ్డి, నందిపాటి రవి, తాటికొండ పాపి రెడ్డి, కొండేటి శ్రీ నివాస్ రెడ్డి, గాలి బాల్ రెడ్డి, బోయపాటి అంతోని రెడ్డి, బోయపాటి ఆనంద్ రెడ్డి, ఆదూరి చిన్నపు రెడ్డి, కొమ్మ రెడ్డి రాజారెడ్డి, గోపి,ఏరువ సుందర రెడ్డి, తుమ్మ జోసెఫ్ రెడ్డి, గాదె విక్టర్ రెడ్డి, మరియు గ్రామ మహిళలు , వృద్ధులు పాల్గొన్నారు.