అంతర్ రాష్ట్ర నేరస్తురాలును అరెస్టు చేసిన సత్తుపల్లి పోలీసులు
సీ కే న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునిర్.
బుధవారం స్థానిక పోలీస్ వారు అంతర్ రాష్ట్ర నేరస్తురాలును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేవరకొండ దుర్గా భర్త పేరు మురళి, 50సం.లు. కులం ఎరుకల, పెద్దచెరువుగట్టు నూజివీడు నూజివీడు మండలం నివాసి కుటుంబ అవసరాలకు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకొని బస్ స్టాండ్ ఏరియాలో ప్రయాణికులు ఒంటరిగా ఉన్న సమయం లో వల్ల చేతులలో ఉన్న సంచులను గమనించి అందులో ఉన్న వాటిని దొంగిలించుకుంటూ సంచులలో ఉన్న వస్తువులను దొంగతనంగా అమ్మి సొమ్ము చేసుకునే ఆలోచన లో భాగంగా సత్తుపల్లి మండలంలోని సత్తుపల్లి బస్ స్టాండ్ ఏరియాలో తిరుగుతూ, సత్తుపల్లి బస్ స్టాండ్ దగ్గర మహిళా ప్రాణికురాలు ఖమ్మం వైపు వెళ్ళు బస్ కోసం ఉండగా ఆమె చేతిలో ఉన్న సంచిలో ఉన్న చిన్న డబ్బాను దొంగలించి ఇంటికి తీసుకొని పోయి ఏరోజు బంగారపు వస్తువులను కరిగించి అమ్ముటకు వస్తుండగా సత్తుపల్లి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు వాహన తనికి చేయుచుండగా అన్నీ వాహనాలు అపుతుండగా పోలీసు వారిని చూసి ఆటొలో నుంచి పారిపోతుండగా గమనించి ఆమెను వెంబడించి పట్టుకొనగ ఆమె వద్ద బంగారపు వస్తువుల డబ్బా కలదు.
ఆమెను విచారించగా సత్తుపల్లి లో 08.07.2024 నాడు సోమవారం సాయంత్రం సుమారు 3 గంటల సమయం లో ఖమ్మం వైపు వెళ్ళు బస్సు ల వద్ద దొంతనం చేసిన బంగారపు వస్తువులు ఇవే అని తెలిపినది.
ఆమెను సత్తుపల్లి పోలీసులు అరెస్టు చేసి బుధవారం రిమాండ్ కు తరలించారు.స్వాధీన పరచుకున్న సొత్తు వివరాలు 1. చంద్రహారం, 4 గాజులు, 2 చైన్లు,3 ఉంగరాలు పోలీసు వారు నిందితురాల నుంచి స్వాధీనం చేసుకున్నారు.