పోలీస్‌ స్టేషన్‌లో వివాహిత హల్‌చల్‌ ఖమ్మం ఖానాపురం హవేలి పోలీసు స్టేషన్‌లో వివాహిత శనివారం హల్‌చల్‌ చేసింది. ఏఆర్‌ కానిస్టేబుల్‌ రాంబాబుతో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆమె భర్త ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో భాగంగా సదరు యువతిని స్టేషన్‌కు శనివారం పిలిపించి నోటీసు ఇచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో తాను నోటీసు తీసుకోనని తిరస్కరించడంతోపాటు, కానిస్టేబుల్‌తో ఉన్న ఫొటోలు తనవి కావని, మార్ఫింగ్‌ చేశారంటూ …

పోలీస్‌ స్టేషన్‌లో వివాహిత హల్‌చల్‌

ఖమ్మం ఖానాపురం హవేలి పోలీసు స్టేషన్‌లో వివాహిత శనివారం హల్‌చల్‌ చేసింది. ఏఆర్‌ కానిస్టేబుల్‌ రాంబాబుతో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆమె భర్త ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు విచారణలో భాగంగా సదరు యువతిని స్టేషన్‌కు శనివారం పిలిపించి నోటీసు ఇచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో తాను నోటీసు తీసుకోనని తిరస్కరించడంతోపాటు, కానిస్టేబుల్‌తో ఉన్న ఫొటోలు తనవి కావని, మార్ఫింగ్‌ చేశారంటూ గొడవకు దిగింది.

అలాగే చేతిలో పెట్రోలు సీసా పట్టుకుని వచ్చి బెదిరించింది. ఆమెకు కౌన్సెలింగ్‌ చేసి పంపించారు. కాగా తన పిల్లలకు కూడా ప్రాణహాని ఉందని, వారిని తనకు ఇప్పించాలని ఆమె భర్త పోలీసులను వేడుకున్నట్లు తెలుస్తోంది.

Updated On 14 July 2024 1:13 PM IST
cknews1122

cknews1122

Next Story