దొరికిన పర్సును అప్పగించి నిజాయితీ చాటిన జర్నలిస్ట్. చిత్తూరు జిల్లాపలమనేరు నియోజకవర్గం జూలై 20 సి కే న్యూస్ పలమనేరు నియోజకవర్గం కొలమాసన పల్లికి చెందిన గజేంద్ర జర్నలిస్ట్ గా పని చేస్తున్నాడు. గజేంద్రకు శనివారం నాడు, కొలమాసన పల్లిలో ఓ పర్సు రోడ్డుపై పడి ఉండడం గమనించి, తెరిచి చూడగా అందులో సుమారు 3500 నగదు, పలు ఐడి కార్డులు ఉండడంతో, వెంటనే సామాజిక మాధ్యమాల్లో ఈ విషయాన్ని తెలియపరిచాడు. విషయం పర్సు పోగొట్టుకున్న ఎస్ …

దొరికిన పర్సును అప్పగించి నిజాయితీ చాటిన జర్నలిస్ట్.

చిత్తూరు జిల్లా
పలమనేరు నియోజకవర్గం జూలై 20 సి కే న్యూస్

పలమనేరు నియోజకవర్గం కొలమాసన పల్లికి చెందిన గజేంద్ర జర్నలిస్ట్ గా పని చేస్తున్నాడు.

గజేంద్రకు శనివారం నాడు, కొలమాసన పల్లిలో ఓ పర్సు రోడ్డుపై పడి ఉండడం గమనించి, తెరిచి చూడగా అందులో సుమారు 3500 నగదు, పలు ఐడి కార్డులు ఉండడంతో, వెంటనే సామాజిక మాధ్యమాల్లో ఈ విషయాన్ని తెలియపరిచాడు.

విషయం పర్సు పోగొట్టుకున్న ఎస్ సునీల్ కు తెలియడంతో జర్నలిస్టు గజేంద్రను సంప్రదించి, పలమనేరు పోలీస్ స్టేషన్ వద్ద తన పర్సును తీసుకుని కృతజ్ఞతలు తెలిపాడు.

ఈ సమాజంలో రోడ్డుపై ఏదైనా కనిపిస్తే జేబుల్లో వేసుకుని వెళ్లిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటిది నిజాయితీగా బాధితుడికి పర్స్ ను అప్పగించడంతో, పలువురు గజేంద్రను అభినందించారు.

Updated On 20 July 2024 3:00 PM IST
cknews1122

cknews1122

Next Story