Andhra PradeshPolitical

దొరికిన పర్సును అప్పగించి నిజాయితీ చాటిన జర్నలిస్ట్

దొరికిన పర్సును అప్పగించి నిజాయితీ చాటిన జర్నలిస్ట్

దొరికిన పర్సును అప్పగించి నిజాయితీ చాటిన జర్నలిస్ట్.

చిత్తూరు జిల్లా
పలమనేరు నియోజకవర్గం జూలై 20 సి కే న్యూస్

పలమనేరు నియోజకవర్గం కొలమాసన పల్లికి చెందిన గజేంద్ర జర్నలిస్ట్ గా పని చేస్తున్నాడు.

గజేంద్రకు శనివారం నాడు, కొలమాసన పల్లిలో ఓ పర్సు రోడ్డుపై పడి ఉండడం గమనించి, తెరిచి చూడగా అందులో సుమారు 3500 నగదు, పలు ఐడి కార్డులు ఉండడంతో, వెంటనే సామాజిక మాధ్యమాల్లో ఈ విషయాన్ని తెలియపరిచాడు.

విషయం పర్సు పోగొట్టుకున్న ఎస్ సునీల్ కు తెలియడంతో జర్నలిస్టు గజేంద్రను సంప్రదించి, పలమనేరు పోలీస్ స్టేషన్ వద్ద తన పర్సును తీసుకుని కృతజ్ఞతలు తెలిపాడు.

ఈ సమాజంలో రోడ్డుపై ఏదైనా కనిపిస్తే జేబుల్లో వేసుకుని వెళ్లిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటిది నిజాయితీగా బాధితుడికి పర్స్ ను అప్పగించడంతో, పలువురు గజేంద్రను అభినందించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button