Uncategorized

నీది హాఫ్ నాలెడ్జ్… నీకు అసలు నాలెడ్జ్ లేదు.. కోమటిరెడ్డి V/హరీష్ రావు

నీది హాఫ్ నాలెడ్జ్… నీకు అసలు నాలెడ్జ్ లేదు.. కోమటిరెడ్డి V/హరీష్ రావు

నీది హాఫ్ నాలెడ్జ్… నీకు అసలు నాలెడ్జ్ లేదు.. కోమటిరెడ్డి V/హరీష్ రావు

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ , బీఆర్ఎస్ నేతల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. మంత్రి కోమటిరెడ్డి, మాజీ మంత్రి హరీశ్ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు.

కోమటిరెడ్డిని హాఫ్ నాలెడ్జ్ అని హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ప్రజలకు కోమటిరెడ్డి క్షమాపణ చెప్పాలన్నారు.

దీనిపై సీరియస్ అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి…అసలు హరీశ్ కు నాలేడ్జే లేదని కౌంటర్ ఇచ్చారు. ఆకారాం పెరిగింది కానీ తెలివి లేదన్నారు. హరీశ్ క్షమాపణ చెప్పాలన్నారు.

24 గంటల కరెంట్ ఎక్కడ ఇచ్చారో హరీశ్ చెప్పాలని ప్రశ్నించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

దళితుడిని సీఎంను చేస్తానన్న కేసీఆర్ ఎందుకు చేయలేదన్నారు. హరీశ్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందన్నారు. కేసీఆర్ రాలేకనే హరీశ్ ను సభకు పంపించారని చెప్పారు.

సభలో ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతానన్న కేసీఆర్ సభకు రాలేదన్నారు. కేంద్రబడ్జెట్ పై కేసీఆర్ ఎందుకు స్పందించలేదన్నారు. అబద్ధాలు, గ్యారడీలంటేనే బీఆర్ఎస్ అని చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button