HyderabadPoliticalTelangana

కావాలన్నది వాళ్లే… సెగ తగలగానే వద్దన్నది వాళ్లే..

కావాలన్నది వాళ్లే… సెగ తగలగానే వద్దన్నది వాళ్లే..

అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…విద్యుత్ ఒప్పందాల విషయంలో సత్యహరిశ్చంద్రుడి తరువాత కేసీఆరే అన్నట్లు వారు మాట్లాడారు.

ఛత్తీస్ ఘడ్, యాదాద్రి , భద్రాద్రి ఒప్పందాలపై వారే విచారణకు అడిగారు.వారి కోరిక మేరకే విచారణ కమిషన్ నియమించాం…కమిషన్ దగ్గరకు వచ్చి వివరాలు ఇవ్వాలని కోరితే కమిషన్ పైనే ఆరోపణలు చేశారు.

విచారణ కమిషన్ ముందు వాదన వినిపించకుండా కమిషన్ వద్దని కోర్టుకు వెళ్లారు…విచారణ కొనసాగించాల్సిందేనని సుప్రీంకోర్టు చెప్పింది.. కానీ కొత్త కమిషన్ చైర్మన్ ను నియమించాలని చెప్పింది.విచారణ కమిషన్ కు కొత్త చైర్మన్ ను ఇవాళ సాయంత్రంలోగా నియమిస్తాం..

తెలంగాణకు వాళ్లే ఏదో కొత్త వెలుగులు తెచ్చినట్లు మాట్లాడుతున్నారు…వైఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలతోనే హైదరాబాద్ నగరానికి నిరంతర విద్యుత్.ఏ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఆ ఆస్తులు సంబంధిత ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందుతాయని చట్టం ఉంది.

కానీ ఉత్పత్తి ప్రాతిపదికన కాకుండా, వినియోగ ప్రాతిపదికన విభజన జరగాలని ఆనాడు జైపాల్ రెడ్డి కేంద్రాన్ని ఒప్పించారు.రాజ్యాంగంలో లేని ప్రత్యేక మినహాయింపు తెలంగాణకు ఇప్పించారు.

53.46శాతం తెలంగాణకు, 46.54 శాతం ఏపీకి విద్యుత్ పంపిణీ చేసేలా జైపాల్ రెడ్డి తీవ్రంగా కృషి చేశారు.తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్లు కమ్మకుండా చేశారు..ఆనాడు కేసీఆర్ ఎలా సభను తప్పుదోవ పట్టించారో 2015 రికార్డులు తీయండి.

ఆనాడు నేను సభలో మాట్లాడితే నన్ను సభ నుంచి మార్షల్స్ తో బయటకు పంపించారు.సోలార్ ప్రాజెక్ట్ గురించి గొప్పగా చెబుతున్నారు… అవి ప్రయివేటు కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి..వీళ్ల ఏలుబడిలో సోలార్ పవర్ కేవలం ఒక మెగావాట్ మాత్రమే.పవర్ ప్లాంట్స్ కు సంబంధించి ఎలక్ట్రో మెకానికల్ వర్క్, సివిల్ వర్క్ కాంట్రాక్టు విషయంలో వీళ్ల తెలివి ప్రదర్శించారు.

గంపగుత్తగా బీహెచ్ఎల్ కాంట్రాక్టు అప్పగించారు..బీహెచ్ఈఎల్ నుంచి సివిల్ వర్క్స్ మొత్తం వీళ్ల బినామీలు, బంధువులు, అనుయాయులకు ఇచ్చారు.

అందులో వేలకోట్ల ఫ్రాడ్ జరిగింది.విచారణలో అంతా బయటపడుతుందనే ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు.2400 మెగావాట్ల విద్యుత్ ప్లాంటుకు టెండర్ వేస్తే సూపర్ క్రిటికల్ టెండర్ పిలిస్తే కొరియన్, బీహెచ్ఈఎల్, మరో కంపెనీ పాల్గొన్నాయి.

అక్కడ 18శాతం లెస్ కు బీహెచ్ఈఎల్ పనులు దక్కించుకుంది.ఇక్కడ కూడా 18శాతం లెస్ కు పనులు చేసే అవకాశం ఉన్నా.. ప్రాజెక్టును నామినేషన్ పై బీహెచ్ఈఎల్ కు అప్పగించారు.అందులో దాదాపు 8వేల కోట్లు కుంభకోణం జరిగింది.

భద్రాద్రి పవర్ ప్రాజెక్టు విషయంలో సబ్ క్రిటికల్ టెక్నాలజీ తో గుజరాత్ లోని ఇండియా బుల్స్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించాలని చట్టంలో ఉన్నా ఉల్లంఘించారు.ఇండియా బుల్స్ నుంచి వెయ్యి కోట్లు మెక్కి కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించారు.

భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ కట్టాల్సిన చోట కట్టలేదు..వీళ్ల నిర్వాకంతో 16 మంది అధికారులు విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.రెండేళ్లలో పూర్తి కావాల్సిన పనులు ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న పరిస్థితి.

వారి కోరిక మేరకే విచారణ కమిషన్ ఏర్పాటు చేశాం..దొరికిపోయామని అర్ధమైంది కాబట్టే కమిషన్ పై ఆరోపణలు చేశారు..కావాలన్నది వాళ్లే… సెగ తగలగానే వద్దన్నది వాళ్లే..తిన్నింటి వాసాలులేక్కబెట్టే లక్షణాలు మాకు లేవు..మీ వాదన ఏంటో కమిషన్ ముందు చెప్పండి…సాయంత్రానికల్లా విచారణ కమిషన్ కు కొత్త చైర్మన్ ను నియమిస్తాం..

విద్యుత్ కొనుగోళ్లపై సభలో నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజూ వాడీవేడిగా కొనసాగుతున్నాయి. శాసనసభలో విద్యుత్ రంగంపై చర్చలో భాగంగా గత బీఆర్‌ఎస్ సర్కార్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు

సీఎం మాట్లాడుతూ…‘‘సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి ఆవేదన చూస్తుంటే.. ఆల్రెడీ చర్లపల్లి జైలులో అన్నట్లు ఉంది. ఈ సభ్యుడు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పలు అంశాలు ప్రస్తావించారు. సత్య హరిచంద్రుడి వంశంలో పుట్టాం. ఆయన తర్వాత కేసీఆర్ అన్నట్లు.. విద్యుత్ కొనుగోళ్ల మీద విచారణ అడిగారు. ప్రభుత్వం ఆమోదించింది.

జస్టిస్ నర్సింహారెడ్డిని నియమించడం జరిగింది. మాజీ సీఎం, మాజీ మంత్రులను విచారణకు వచ్చి వాదనని వినిపించే ప్రయత్నం చేశారు. సుప్రీం కోర్టు కమిషన్ కొనసాగించల్సిందే అని.. చైర్మన్‌ను మార్చండి అని సూచించింది. ఇవ్వాళ సాయంత్రం విద్యుత్ కమిషన్ కొత్త చైర్మన్‌ను నియమిస్తాం’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

తెలంగాణ జనాభా ప్రకారం ఆస్తులు.. అప్పుల పంపకం జరిగిందన్నారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఏర్పాటు సమయంలో ఉత్పత్తి చేసే సంస్థలు కొత్త రాష్ట్రంలో.. వినియోగం మహారాష్ట్రకు వెళ్ళడంతో తీవ్ర సంక్షోభం ఎదుర్కొందన్నారు. మాజీ సీఎం అసెంబ్లీలో కట్టే పట్టుకొని విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటుంది అని చెప్పారని గుర్తుచేశారు.

జైపాల్ రెడ్డి ఉత్పత్తి ప్రాతిపదికన కాకుండా.. వినియోగం ప్రాతిపదికన విభజన జరగాలని అలా అయితే తెలంగాణ ఇబ్బంది ఉండదు అని చెప్పారన్నారు. విభజన చట్టంలో, బిల్లులో లేని.. స్పీకింగ్ ఆర్డర్ జైపాల్ రెడ్డి విద్యుత్‌కు సంబంధించిన ఇప్పించడం జరిగిందన్నారు. జైపాల్ రెడ్డి కృషితో 53.64 శాతం తెలంగాణకు విద్యుత్ వాటా ఇప్పించారన్నారు.

‘‘ఇక్కడ ఉన్న పికుడుగాడు ఇవ్వడు అది చేయలేదు’’ అని విమర్శించారు. కేసీఆర్ ఎలా సభను తప్పుదోవ పట్టిస్తున్నారు అని…తాను తెలుగు దేశంలో ఉన్నప్పుడు వాస్తవాలను వివరించడం జరిగిందన్నారు. మార్షల్‌తో తనను బయట పడేయించారని ఆనాటి విషయాలను గుర్తుచేశారు.

తెలంగాణను విద్యుత్ సంక్షోభం నుంచి జైపాల్ రెడ్డి, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ బయట పడేశారన్నారు. ఏడు వేల యూనిట్ల ఉత్పత్తి నుంచి 19 వేల ఉత్పత్తి చేశామని సిగ్గు లేకుండా చెబుతున్నారన్నారు. ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేస్తే.. ప్రభుత్వానికి రూపాయి ఖర్చూ లేకుండా ఏర్పాటు జరిగిందన్నారు. ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ఒప్పందాలు జరిగితే కమిషన్‌లు ఎలా వస్తాయి అంటున్నారన్నారు.

ఎక్కడ నొక్కారు.. ఎక్కడ పొక్కారు అనేది తెలుసన్నారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పర్యవేక్షణలో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందన్నారు. తెలివితో డైరెక్ట్‌గా బీహెచ్‌ఈఎల్‌కు కాంట్రాక్టు ఇచ్చారన్నారు. విచారణకు ఇస్తే.. ఎందుకు గుండెలు గుద్దుకుంటున్నారు.. బాధపడుతున్నారని ప్రశ్నించారు.

సివిల్ కాంట్రాక్టులు అన్ని వీళ్ళ బినామీలకు ఇచ్చారని విమర్శించారు. కంకర నుంచి సెక్యూరిటీ గార్డుల వరకు.. వీళ్ళ సంబంధీకులకు కట్టబెట్టారని ఆరోపించారు.

2400 మెగా వట్ల విద్యుత్‌కు టెండర్లు పిలుస్తే.. బీహెచ్‌ఈఎల్ ఇతర కంపెనీలు పాల్గొన్నాయన్నారు. అదే తేదీ జార్ఖండ్‌లో 18 శాతం తక్కువకు 2400 వందల మెగా వాట్ల ఉత్పత్తికి ఒప్పందం కుదుర్చుకుందన్నారు.

రాష్ట్రాన్ని ఎలా దోచుకోవచ్చు.. అనేది వాళ్ళు, వాళ్ళ గురువు చేసి చూపెట్టారన్నారు. సబ్ క్రిటికల్‌లో విద్యుత్ తక్కువ.. బూడిద ఎక్కువ వస్తుందన్నారు. సూపర్ క్రిటికల్‌లో విద్యుత్ ఎక్కువ.. బూడిద తక్కువ వస్తుంది అని మన్మోహన్ సింగ్ పక్కాగా చెప్పారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో పేర్కొన్నారు..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Hey there! We keep this news portal free for you by displaying ads. However, it seems like your ad blocker is currently active. Please consider disabling it to support us in keeping this platform running and providing you with valuable content. Thank you for your support!