మదనపల్లిలో కాల్పల కలకలం
యువకుల మధ్య ఘర్షణ
నివారించబోయిన వ్యక్తిపై కాల్పులు
స్వల్ప గాయాలు .. ఆసుపత్రికి తరలింపు
లైసెన్సు లేని తుపాకీ స్వాధీనం
పోలీసుల అదుపులో నిందితుడు
Web desc : సొంత బామ్మర్ది పై ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లి లో కలకలం రేపింది. మదనపల్లె రూరల్ మండలం వలసపల్లి పంచాయతీ నవోదయ కాలనీలో అర్ధ రాత్రి మద్యం సేవించి ఓ బ్యాచ్ వీరంగం సృష్టించింది. కొందరు యువకులు గొడవ పడుతుంటే స్థానికుడు రెడ్డి ప్రవీణ్ వెళ్లి సముదాయించే యత్నం చేశారు.
గొడవ వద్దనే అడ్డుకునే క్రమం లో రెడ్డి ప్రవీణ్ తన మామ దివాకర్ ను ప్రక్కకు నెట్టాడు.. అగ్రహించిన దివాకర్ ఇంట్లో లోకి వెళ్లి లైసెన్స్ లేని తుపాకీ తీసుకొచ్చి రవ్వలను లోడు చేసి బామ్మర్ది రెడ్డి ప్రవీణ్ ను కాల్చాడు. శరీరంలోకి రవ్వలు చొచ్చు కెళ్లాయి. తుపాకీ శబ్దంతో ఉలిక్కిపడిన కాలనీ వాసులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.
తాలూకా సీఐ శేఖర్, ఎస్ఐలు రవికుమార్, వెంకటేశ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రుడిని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. .. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు.ఘర్షణకు కారకులు దివాకర్, ఆనంద్, సురేశ్, అన్సర్ అనే యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇంతకీ ఈ వేట తుపాకీ అతడికి ఎలా వచ్చింది? అంటే అన్నమయ్య జిల్లాలో నాటు తుపాకీ వినియోగం సర్వసాధారణమా? ఇదే స్థితి ఏన్నేళ్లుగా సాగుతోంది. ఈ వేట కథ పోలీసులకు తెలుసా? తెలిసినా వదిలేశారా? ఏమో… ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉండవు.