షాద్ నగర్ ఇన్స్పెక్టర్ రాంరెడ్డి సస్పెండ్?
హైదరాబాద్ : దళిత మహిళను హింసించిన షాద్ నగర్ ఇన్స్ పెక్టర్ పై ఈరోజు సస్పెన్షన్ వేటు పడింది.
షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పె క్టర్ రాంరెడ్డి సహా ఐదుగురు కానిస్టేబుళ్లను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు.
దళిత మహిళను హింసించారనే రాంరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. షాద్ నగర్ కు చెందిన నాగేందర్ అనే వ్యక్తి తన ఇంట్లో 22 తులాల బంగారం, రూ. 2 లక్షలు చోరీ అయ్యాయని ఫిర్యాదు చేశారు.
నాగేందర్ ఇంటి ఎదురుగా ఉండే భీమయ్య, సునీత దంపతులను సీఐ రాంరెడ్డి పిలిచి విచారించారు. ఆ తర్వాత గత నెల 30న స్టేషన్ కు తీసుకెళ్లి తమను చిత్రహింసలు పెట్టారని సునీత దంపతులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై సీపీ విచారణకు ఆదేశించారు. ఏసీపీ రంగస్వామి విచారణ చేసి సీపీకి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా సీపీ చర్యలు తీసుకున్నారు.