డాయ్ యాప్ ప్రధాన నిందితుడు అరెస్ట్
అరెస్టు చూపుతున్న పలమనేర్ డిఎస్పి విష్ణు రఘువీర్.
పలమనేర్ నియోజకవర్గం, ఆగస్టు 8. సి కె న్యూస్
పలమనేరులో డాయ్ యాప్ కలకలం అందరికీ తెలిసిందే. ఈ విచారణలో భాగంగా.... ఈరోజు, ప్రధాన నిందితుడు రాజేష్ ను, గంగవరం వద్ద, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
డీఎస్పీ రఘువీర్ మాట్లాడుతూ....
. ఈ కేసులో మూడవ మూడవ ముద్దాయి రాజేష్ అని, ఇతను డాయ్ యాప్ గురించి మీటింగ్ లు నిర్వహించి, చాలామంది ఈ యాప్ లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రధాన కారకుడు అయ్యాడని,
300 రూపాయలు కడితే రోజుకు 47 రూపాయలు చొప్పున వస్తుందని, అలా వెయ్యి నుండి మొదలైన ఈ మోసం లక్షలు ఇన్వెస్ట్ చేయడం వరకు చేరిందని, ఈ ఒక్క రాజేష్, 500 మందిని ఈ యాప్ లో చేర్పించాడని, డిఎస్పి తెలియజేశారు.
ఆయన మాట్లాడుతూ ....ఇతని అకౌంట్లు అన్ని పరిశీలించి, ట్రాన్సాక్షన్లు చెక్ చేయగా... ఇతనికి 35 లక్షల రూపాయలు కమిషన్ వచ్చినట్లు, ఆ కమిషన్ను, అతను ఉంచుకోకుండా, తిరిగి 31 లక్ష రూపాయలు ఈ యాప్ లోనే ఇన్వెస్ట్ చేసినట్టు, ఈ సందర్భంగా డిఎస్పి తెలియజేశారు.
ఒక్క పలమనేర్ లోనే కాకుండా... గంగవరం, బైరెడ్డిపల్లి, వీకోట, బెంగళూరు, పంజాణి ఇలా చాలా ఊర్లలో, ఈ యాప్ ద్వారా డబ్బు కట్టిన వాళ్ళు ఉన్నారని ఆయన తెలియజేశారు.
ఈ డాయ్ యాప్ ద్వారా దేశంలో కూడా, చాలాచోట్ల మోసపోయారని, నాగాలాండ్ లో కూడా దీనిపై కేసు రిజిస్టర్ అయిందని, ఏ1 ముద్దాయిగా, బాలసుబ్రమణ్యం, ఏ 2 గా టీనా ఉన్నారని, కేరళలో కూడా, ఈ యాప్ పై కేసు నమోదు అయినట్లు తెలిసిందని ఆయన తెలియజేశారు.
కేసులో ఏ 1 ముద్దాయిగా ఉన్న బాలసుబ్రమణ్యం, టీనాలు, మూడవ ముద్దాయి అయిన రాజేష్ భౌతికంగా చూడకపోయినప్పటికీ ఆన్లైన్లో పరిచయమై, వాట్సాప్ ద్వారా ఈ తతంగమంతా నడిచిందని, ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
ప్రజలను ఒకటే కోరుకుంటున్నానని, దయచేసి ఇలాంటి యాప్ లను నమ్మవద్దని, అప్రమత్తంగా ఉండాలని డిఎస్పీ విష్ణు రఘువీర్ పిలుపునిచ్చారు.
దేశంలోని పలు బ్యాంకులకు ఈ అమౌంట్ వెళ్లిందని, త్వరలోనే ఆ డిటైల్స్ తెప్పించి,ఎవరెవరి అకౌంట్లకు వెళ్ళింది అనే విషయాన్ని రాబడతామని, ఈ ఇష్యూ పైన సీరియస్ యాక్షన్ తీసుకుంటామని, మా ఆఫీసర్లందరూ ఈ ఇష్యుని సీరియస్ గా తీసుకొని పనిచేస్తున్నామని, ఈ సందర్భంగా డిఎస్పి విష్ణు రఘువీర్ తెలియజేశారు.
ఈ ప్రెస్ మీట్ లో, డీఎస్పీ విష్ణు రఘువీర్, సిఐ చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.