మంత్రి పొంగులేటి కి తృటిలో తప్పిన ప్రమాదం…
సికె న్యూస్ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. సత్తుపల్లి వెళ్తుండగా వైరా బ్రిడ్జి దగ్గర ఈ ఘటన జరిగింది.పోలీసులు, భద్రత సిబ్బంది అప్రమత్తం అయ్యారు. మంత్రి పొంగులేటిని మరో వాహనంలో పంపించారు.
మంత్రి పొంగులేటి ప్రయాణిస్తున్న కారుకు పంక్చర్
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయాణించే వాహనానికి వైరాకు సమీపంలో పంక్చర్ అయింది.
హైలెవెల్ వంతెన దిగిన తర్వాత జాతీయ ప్రధాన రహదారిపై పొంగులేటి ప్రయాణిస్తున్న వాహనం వెనుక భాగంలోని ఎడమ టైరు పంక్చర్ కాగా అప్రమత్తమై కారును వెంటనే నిలిపివేశాడు.
దీంతో పొంగులేటి కాన్వాయ్ రహదారిపై కొద్దిసేపు నిలిచిపోయింది. అనంతరం వేరే వాహనంలో పొంగులేటి వెళ్లిపోయారు.