ఆర్టీసీ బస్సులో మహాలక్ష్మికి జన్మనిచ్చిన మహిళ గద్వాల్ జిల్లా : తెలంగాణ ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో బాధ పడుతున్న ఓ గర్భిణికి ఆర్టీసీ కండక్టర్ పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. గద్వాల మండలం కొండపల్లి గ్రామానికి చెందిన చెందిన సంధ్య సోమవారం ఉద యం గద్వాల డిపోకు చెందిన టీఎస్ 33 టి 2543 నెంబర్ గల ఆర్టీసీ బస్సు గద్వాల్ నుండి వనపర్తికి పల్లె వెలుగు బస్సులో వెళ్తున్న క్రమంలో వనపర్తి కి దాదాపు …

ఆర్టీసీ బస్సులో మహాలక్ష్మికి జన్మనిచ్చిన మహిళ

గద్వాల్ జిల్లా : తెలంగాణ ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో బాధ పడుతున్న ఓ గర్భిణికి ఆర్టీసీ కండక్టర్ పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు.

గద్వాల మండలం కొండపల్లి గ్రామానికి చెందిన చెందిన సంధ్య సోమవారం ఉద యం గద్వాల డిపోకు చెందిన టీఎస్ 33 టి 2543 నెంబర్ గల ఆర్టీసీ బస్సు గద్వాల్ నుండి వనపర్తికి పల్లె వెలుగు బస్సులో వెళ్తున్న క్రమంలో వనపర్తి కి దాదాపు 15 కి.మీ దూరంలో నాసినపల్లి గ్రామ స్టేజ్ వద్ద గర్భిణీకి పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి.

ఈ విషయాన్ని గమనించిన కండక్టర్ జి.భారతి అప్రమత్త మై డిపో మేనేజర్‌కు సమాచారం అందించారు. డీఎం సూచనల మేరకు ఒక నర్సు, మహిళా ప్రయాణికుల సాయంతో సాధారణ ప్రసవం చేశారు.

ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వనపర్తి గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు.

బస్సులోనే కాన్పు చేసి మానవత్వం చాటు కున్న కండక్టర్ భారతీతో పాటు నర్సు, మహిళా ప్రయాణికులను ఆర్టీసి‌ ప్రయాణికులు, అధికారులు‌ అభినందనలు తెలియజేశారు.

Updated On 19 Aug 2024 1:57 PM IST
cknews1122

cknews1122

Next Story